/rtv/media/media_files/2026/04/27/surat-wife-2026-04-27-10-05-48.jpg)
Surat Crime: గుజరాత్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత క్రూరంగా చంపి, ఆమె మృతదేహాన్ని పాడుబడిన ఇంట్లోని పెట్టెలో దాచి, పోలీసులనే తప్పుదోవ పట్టించాడో ప్రబుద్ధుడు. సూరత్‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. నిందితుడు తన భార్యను చంపడమే కాకుండా, శవం బయటపడకుండా దానిపై సిమెంట్ పోసి కప్పి ఉంచడం అతని క్రూరత్వానికి నిదర్శనం.
వివరాల్లోకి వెళ్తే.. విశాల్ సాళ్వే (40) అనే వ్యక్తి తన భార్య శిల్పా సాళ్వే (39) గత నాలుగు రోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వృత్తిరీత్యా డైటీషియన్ అయిన శిల్ప అదృశ్యంపై పోలీసులు సాధారణ మిస్సింగ్ కేసుగా విచారణ మొదలుపెట్టారు. అయితే, విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే కేసు ఊహించని మలుపు తిరిగింది.
ఈ కేసులో మలుపు తిప్పింది నిందితుడు రాసిన లేఖ. విశాల్, శిల్పల మైనర్ కొడుకుకు ఇంట్లో ఒక నోట్ దొరికింది. ఆ లేఖలో విశాల్ తాను ఒక పెద్ద తప్పు చేశానని, శిల్ప ఇక జీవించి లేదని రాసి ఉంది. ఆ బాలుడు వెంటనే ఆ లేఖను పోలీసులకు అందించడంతో, మిస్సింగ్ కేసు కాస్తా హత్య కేసుగా మారింది.
Also Read: గ్యాంగ్‌స్టర్ గా బాలయ్య.. కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా!
పాడుబడిన ఇంటిని
పోలీసులు నిందితుడికి సంబంధించిన సలాబత్‌పురా ప్రాంతంలోని ఒక పాడుబడిన ఇంటిని గుర్తించారు. ఆ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన అధికారులకు భయంకరమైన దుర్వాసన ఎదురైంది. గది మూలలో ఉన్న ఒక చెక్క పెట్టెను తెరిచి చూడగా, లోపల శిల్ప మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉంది. శవం నుంచి వాసన బయటకు రాకుండా నిందితుడు దానిపై పచ్చి సిమెంట్‌ను పోసి కప్పి ఉంచాడు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి 4-5 రోజుల ముందే ఈ హత్య జరిగి ఉండవచ్చు.
Also Read: విభిన్న పాత్రలో దువ్వాడ మాధురి.. ‘చీన్ టపాక్ డుం డుం’లో సర్‌ప్రైజ్ రోల్!
భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే విశాల్ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు విశాల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలతో ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
Follow Us