తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటుగా వైరల్ ఫీవర్స్, ఫ్లూ వైరస్ వ్యాప్తి బాగా పెరిగింది. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. మరికొందరిని గొంతు ఇన్ఫెక్షన్ వేధిస్తోంది. వాతావరణ మార్పులు, కాలుష్య తీవ్రతతో వృద్దుల్లో కొందరు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి టైమ్ లోనే చైనాలో విజృంభిస్తున్న HMPA వైరస్ లక్షణాలు కూడా సిమిలర్ గా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. 30 శాతం పెరిగిన రోగుల సంఖ్య ఏ లక్షణాలతో ఎక్కువమంది ఆసుపత్రుల్లో చేరుతున్నారనే వివరాలను సేకరిస్తోంది. గత వారం ఓపీ తాకిడి ఎలా ఉందో అదికారుల నుంచి సేకరిస్తుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే రోగుల సంఖ్య దాదాపుగా 30 శాతం పెరిగిందని డాక్టర్లు అంటున్నారు. సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలు అయితే ఓకే కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే శ్వాసకోశ సమస్యలు అయితే వెంటనే డాక్టర్లను సంప్రదించి ట్రీట్ మెంట్ తీసుకోవాలని చెబుతున్నారు. కరోనా టైమ్ లో పాటించిన కొన్ని గైడ్ లైన్స్ లను పాటించాలని చెబుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. యాంటీబయాటిక్స్ వాడొద్దు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారు ఉపశమనం కోసం ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. సాధారణ ఫ్లూ ఇన్పెక్షన్ అయితే నాలుగు లేదా ఐదు రోజుల్లో తగ్గుతుందని చెబుతున్నారు. డాక్టర్ల సూచన మేరకే మెడిసిన్స్ వాడాలని సలహా ఇస్తున్నారు. చలికాలంలో ఎక్కువ చల్లని ఫుడ్ కన్నా వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారితో కరచాలనం చేయరాదని, వారు ఉపయోగించిన టవల్స్ ను వాడకూడదని, చేతులతో తరచూ కళ్లు, ముక్కు, నోటిని తాకరాదని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదని చెబుతున్నారు. Also Read : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు