ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపిక‌ యాప్‌ రెడీ: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌ని తెలిపారు.

New Update
Minister Ponguleti Srinivasa Reddy

తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు కాదు? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌పై తాజాగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర‌మ్మ ఇండ్లు

ల‌బ్దిదారుల ఎంపిక పార‌ద‌ర్శకంగా ఉంటుంద‌ని అన్నారు. రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌ని ఆయన తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను శ‌నివారం స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో మంత్రి ప‌రిశీలించారు. ఈ యాప్‌లో ఒక‌టి రెండు మార్పు చేర్పుల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి సూచించారు. 

ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!

వ‌చ్చే వారంలో అందుబాటులోకి యాప్‌

మంత్రి సూచ‌న‌ల ప్రకారం యాప్‌లో కొన్ని మార్పులు చేసి వ‌చ్చే వారంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి  మాట్లాడుతూ.. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకాన్ని ప్రారంభిస్తామ‌ని అన్నారు. ఇందుకు కావ‌ల‌సిన ఏర్పాట్లు తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాల‌ని సూచించారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేవ‌ర‌కు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వీలైనంత‌వ‌ర‌కు వాడుకోవాల‌ని తెలిపారు. ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమ‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌న్నారు.

ఇది కూడా చదవండి:  సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!

అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున.. తెలంగాణ వ్యాప్తంగా 4.16 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటిదశలో నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కాగా ఇటీవలే ఇందిరమ్మ కమిటీ గైడ్‌లైన్స్‌ను కూడా ప్రభుత్వ రిలీజ్ చేసింది. గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. 

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం!

కేంద్రం రూల్స్‌ను రాష్ట్రాలు కూడా పాటించాలి

ఇదిలా ఉంటే నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కేంద్రం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసమే ఓ యాప్‌ను తయారు చేసింది. ఇందులో ప్రభుత్వ ఇళ్లకు అర్హత పొందాలంటే దానికి కావాల్సిన అర్హతలను ఫీడ్ చేసి ఉంచారు. ఇవే రూల్స్‌ను రాష్ట్రాలు కూడా పాటించాలని.. అప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు పొందేందుకు అర్హత ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో పీఎంఏవై నిధులు పొందాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్.. ఈ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన యాప్ ద్వారానే ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టబోతోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు