Wood Fire Cooking:   కట్టెల పొయ్యితో కొన్ని నష్టాలు, మరిన్ని లాభాలు.. అవేంటో తెలుసా..!?

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో గ్యాస్, చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక హోటల్స్‌ మూసివేతకు గురయ్యాయి. మరికొన్ని హోటల్స్‌ మాత్రం సంప్రదాయ కట్టెల పొయ్యిలు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు.

New Update
FotoJet (11)

Wood Fire Cooking

Wood Fire Cooking: ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో గ్యాస్, చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక హోటల్స్‌ మూసివేతకు గురయ్యాయి. మరికొన్ని హోటల్స్‌ మాత్రం సంప్రదాయ కట్టెల పొయ్యిలు వాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక రకంగా మనం మళ్లీ పాత రోజులకు వెళ్లిపోతున్నామనే చెప్పాలి. ఒకపుడు మనం కట్టెల పొయ్యిమీదే వంట చేసుకునేవాళ్లం కానీ తర్వాత  కిరోసిన్, గ్యాస్ స్టవ్స్ వచ్చేశాయి. ఇప్పుడైతే ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్స్ కూడా వాడుతున్నారు. కానీ కట్టెల పొయ్యిపై వండితే  ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.

తాజా యుద్ధంతో  వంటగ్యాస్‌ ప్రపంచ సమస్యగా మారింది. దాంతో మనం.. కొన్నేళ్లుగా మానేసిన కట్టెల పొయ్యిలను మళ్లీ ఇప్పుడు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకైతే ఇళ్లలో ఇంకా వంటగ్యాస్ కొరత తీవ్రంగా రాలేదు. కానీ హాస్టళ్లు, పీజీలు, అంగన్ వాడీలు, హోటల్స్‌లో గ్యాస్ సమస్య వచ్చేసింది. అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కట్టెల పొయ్యిలను తిరిగి వాడకంలోకి తెచ్చారు. కర్రపుల్లల్ని వెలిగించి.. వాటిపై వంటలు వండటం మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని హోస్టళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే  కట్టెల పొయ్యిలకు మారాయి.  
  
కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో రూ.2000కు వరకు పలుకుతోంది. అదే సమయంలో ఒక బ్యాగ్‌ కట్టెలు మనకు రూ.200 నుంచి 400 రూపాయలకే వస్తున్నాయి. వీటితో  మనం వారం రోజుల పాటు వంట చేయవచ్చు. తెలంగాణ, ఏపీలోని కొన్ని గ్రామాల్లో కొన్నిచోట్ల పేద కుటుంబాలు ఇప్పటికీ కట్టెల మీద వంట చేస్తున్నాయి. ముఖ్యంగా అడవులకు దగ్గరగా ఉండేవారు ఇలాగే వండుకుంటారు. హైదరాబాద్‌లో ఐటీ హాస్టళ్లు కూడా గ్యాస్‌ కొరత కారణంగా కట్టెలకు మారి నెలకు రూ.5,000 దాకా ఆదా చేస్తున్నాయి. కట్టెల పొయ్యి దీర్ఘకాలిక ఆదా చేసే అవకాశం ఉంటుంది.

ఇక కట్టెల పొయ్యి మీద వండటం వల్ల రొట్టెలు, బిర్యాని, హలీం వంటివి రుచికరంగా ఉంటాయి.  ఇంకా మట్టి కుండలో వండటం వల్ల పొగతో కూడిన సువాసన ఆహారంతో కలిసి అది ఆహార రుచిని పెంచుతుంది. హైదరాబాద్ షా ఘౌస్ లాంటి హోటళ్లు ఇప్పుడు ఇలాగే వండుతున్నాయి. సర్వేల ప్రకారం ప్రజలు “గ్యాస్ మీద కంటే కట్టెల మీద వండిన ఆహారం రుచి ఎక్కువగా ఉంటోంది” అని తేల్చి చెప్పారు. కట్టెల పొయ్యిపై వండిన ఆహారం సహజంగా ఉంటుంది
కట్టెల పొయ్యిమీద వండటం వల్ల  విటమిన్లు, మినరల్స్ నాశనం అవ్వవు. మట్టి కుండల్లో వండటం వల్ల కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆహారంలోకి విడుదలవుతాయి. ఇది శరీరానికి మంచిది. గ్యాస్ మీద హై హీట్‌లో వండటం వల్ల పోషకాలు కొంత నష్టపోతాయి. తెలంగాణ గ్రామాల్లో ఇలా వండి తిన్న ఆహారంతో“ఎక్కువ ఎనర్జీ వస్తుంది” అంటున్నారు. అలా వండటం వల్ల మన బాడీకి పోషకాలు అందుతాయి. అందువల్ల కట్టెల పొయ్యిపై వండుకోవడం మంచిదని పలువురు అంటున్నారు.
 
 కట్టెల మీద వండిన ఆహారం.. మన శరీరంలో “అగ్ని”ని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇలాంటి ఆహారం తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడటం, ఉబ్బరం రావడం వంటి సమస్యలు  తగ్గుతాయి. హైదరాబాద్‌లో చాలా మంది మహిళలు ఇప్పుడు ఇలా వండి తినడం వల్ల “జీర్ణ సమస్యలు తగ్గాయి” అని చెబుతున్నారు. కొన్ని లగ్జరీ రెస్టారెంట్లు కూడా.. బొగ్గులు, కట్టెలపై వండుతూ.. ఈ తరహా పాత వంటల్ని సరికొత్తగా అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.  .

గ్యాస్ ల కట్టెల కొరత ఉండదు.  కట్టెలు సులభంగా లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల నుంచి కర్ర పుల్లలు, పొడి కట్టెలు ఉచితంగా లేదంటే తక్కువ ధరకు లభిస్తాయి.  అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో అడవుల శాతం ఎక్కువే కనుక అక్కడ ఎండిపోయిన కట్టె పుల్లలు చాలా దొరుకుతాయి. అందువల్ల గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ కట్టెల పొయ్యిల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే.. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం ద్వారా పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తుండటంతో.. గ్రామాల్లోనూ చాలా మంది గ్యాస్ స్టవ్‌లు వాడుతున్నారు. కానీ.. గ్యాస్ కొరత వచ్చినప్పుడు.. కట్టెల పొయ్యిలే బెటర్ అని గ్రామీణులు చెబుతున్నారు. నిజానికి  ప్రజలు కట్టెల పొయ్యిలు వాడితే.. గ్యాస్ కొరత తీరుతుంది.  

 ఇక కట్టెల మంట ఇంటిని వేడి చేస్తుంది. ఇది శీతాకాలంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాని బూడిదను తోటలో ఎరువుగా వాడుకోవడానికి ఉపయోగిస్తారు. ఒకేసారి రెండు మూడు పాత్రల్లో వంటలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సమయాన్ని ఆదా చేస్తుంది. మన వీలును బట్టీ.. కట్టెలు ఎన్ని వాడాలో అన్ని వాడుకోవచ్చు. అయితే వీలయినంతవరకు స్మోక్‌లెస్ మోడల్స్ పొయ్యిలను వాడటం మంచిది.ఇవి రూ.1500 వరకు దొరుకుతాయి. ఇవి ఆరోగ్యానికీ, పర్యావరణానికీ మంచివి. మొత్తంగా గ్యాస్ మళ్లీ రెగ్యులర్‌గా లభించే వరకూ.. తాత్కాలికంగా కట్టెల పొయ్యిలను వాడుకోవడం మేలు.  

ఐతే.. కట్టెల పొయ్యిని అతిగా వాడలేం. దాని వల్ల పొగ సమస్య ఉంటుంది. మహిళలు, పిల్లలకు శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టులు చెబుతున్నాయి. ఐతే.. మంచి వెంటిలేషన్ ఉండే చోట, లేదంటే.. బయట వంట చేస్తే ఈ సమస్య తగ్గుతుంది.  వంట చెరకు కోసం అడవులను ఎక్కువగా నరకడం వల్ల పర్యావరణం దెబ్బ తింటుంది. అడవుల విస్తీర్ణం తగ్గి ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. అడవులు తగ్గడం వల్ల వన్యమృగాలు అంతరించి పోతాయి. అతివృష్టి, అనావృష్టి, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది.

అలాగే పశువులు గొర్రెలు, మేకలు మేపడం వల్ల అడవులు నాశనం అయిపోతాయి. గిరిజన తెగలు పోడు వ్యవసాయం చేయడం వల్ల అడవులు అంతరించి పోతున్నాయి. కట్టెల పొయ్యి వినియోగం వల్ల మహిళల ఊపిరితిత్తులు,కళ్ళు పాడైపోతున్నాయి. అయితే ఈ సమస్యను అధిక మించడానికి తక్కువ కట్టెలు వినియోగించే పొయ్యిలు నేడు అందుబాటులోకి వచ్చాయి. అలాగే పొగరాకుడా నిరోధించు పొయ్యిలు కూడా వచ్చాయి.వాటిని వినియోగించడం చాలా ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు