/rtv/media/media_files/2025/03/01/QGMj8Q5pJqpnZ3BmLq8N.jpg)
SLBC Tunnel Accident
SLBC Tunnel Accident : 22 రోజులుగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుని మృత్యువాత పడిన కార్మికుల కోసం నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. రోజులు గడుస్తున్నా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇంకా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల జాడ పూర్తిగా తెలియడం లేదు. 22 రోజులుగా దేశంలోనే నిష్ణాతులైన వివిధ ఏజెన్సీ ల సహాయంతో సొరంగంలో కూరుకుపోయిన కార్మికుల కోసం వెతుకుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సొరంగంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
ఇప్పటికే టన్నెల్లోకి పంపిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోకు అనుసంధానంగా 30 హెచ్ పీ సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ తో కూడిన యంత్రాన్ని సహాయక చర్యల కోసం శుక్రవారం సొరంగంలోకి పంపారు. ఎస్ ఎల్ బీ సీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యంత్రాలు మట్టిని వేగంగా సమర్థవంతంగా తొలగిస్తాయని భావిస్తున్నారు.
Also read: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి
డి1, డి2 ల వద్ద ఇప్పటికే సింగరేణి, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు నాలుగు మీటర్ల లోతులో మట్టిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను కట్ చేసి బయటకు తరలిస్తున్న క్రమంలో లోపల రెస్క్యూ ఆపరేషన్ కాస్త ఆలస్యంగా నడుస్తుంది. కార్మికులు తవ్విన మట్టిని ఎప్పటికప్పుడు పొక్లెయినర్ సహాయంతో బయటకు తెస్తున్నారు.
Also Read: తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. యూనెస్కో జాబితాలో ముడమాల్ నిలువురాళ్లు
ఇప్పటివరకు రెండు మృతదేహాలను బయటకు తీసుకురాగా, ఇంకా 6 మృతదేహాలను గుర్తించవలసి ఉంది. గత 22 రోజులుగా కేంద్ర, రాష్ట్ర రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా శ్రమ చేస్తున్నప్పటికీ ఇంకా మృతదేహాలను బయటకు తెచ్చి కుటుంబ సభ్యులకి అందించలేకపోయారు. అయితే మరో రెండు రోజుల్లో మిగతా ఆరు మృతదేహాలను కూడా వెలికి తీస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తమ వారి కోసం కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
Also read: Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్