జమిలి ఎన్నికల ముసుగులో కుట్ర.. ఈ సమయంలో ఏచూరి లేకపోవడం తీరని లోటు!

జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ అన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఏచూరి లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరనిలోటని చెప్పారు. ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ఏచూరి అన్నారు. 

author-image
By srinivas
New Update
fdr

 

Sitaram Yechury: జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ అన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించాలనుకుంటున్నారని, ఇలాంటి కీలక సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరనిలోటని చెప్పారు. శనివారం ఏచూరి సంస్మరణ సభలో ఆయన జీవితం, రాజకీయాల గురించి మాట్లాడిన సీఎం రేవంత్.. ఏచూరి ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అన్నారు. ఏచూరిని కలిసిన ప్రతిసారి తనకు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గుర్తొచ్చేవారని చెప్పారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి గారి సమకాలికుడుగా సీతారాం ఏచూరి ఉండేవారని, నమ్మిన సిద్ధాంతం కోసమే చివరి శ్వాస వరకు నిలబడిన వ్యక్తి అంటూ నివాళి అర్పించారు. 

రాహుల్ గాంధీకి మార్గానిర్దేశకుడు..

ఆయన బతికి ఉన్నంత కాలం పేదల కోసం పోరాడారు. మరణాంతరం కూడా ఉపయోగపడాలనే కుటుంబసభ్యుల నిర్ణయం ఎంతో గొప్పది. యూపీఏ హయాంలో  పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు తెలపడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. రాహుల్ గాంధీ ఆయనను మార్గానిర్దేశకుడిగా భావిస్తారు.  రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అన్నారు. సీతారాం ఏచూరి దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి అని సీఎం రేవంత్ కొనియాడారు. పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటు అన్నారు.  

ఫాసిస్టు విధానాలకు నిదర్శనం..

మనకు దిక్సూచీలా ఉండాల్సిన సమయంలో ఆయన మన మధ్య ఏచూరి లేకపోవడం బాధాకరమన్నారు. సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు. విద్యార్థి దశ నుంచి దేశ క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన స్పూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలి. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి మాట్లాడితే ప్రధాని స్పందించకపోవడం వారి ఫాసిస్టు విధానాలకు నిదర్శనం. అలాంటి భాషా ప్రయోగం చేసిన వారిని నియంత్రించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సీఎం రేవంత్ అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment