/rtv/media/media_files/2025/11/07/wine-shops-2025-11-07-08-06-19.jpg)
wine shops closed
Wines are closed : మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ రోజున వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. మార్చి 3న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం6 గంటల వరకు వైన్స్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్లు, క్లబ్ లు మూసివేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కాదని నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆయన హెచ్చరించారు. కాగా హోలీ సందర్భంగా ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించి హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సజ్జనార్ కోరారు.
అలాగే హోలీ పండుగను రంగులమయం చేయడానికి శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ఉండేందుకు పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్ షాపు​నిర్వాహకులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో అల్లర్లు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
అలాగే హోలీ సందర్భంగా ఎవరికీ వారు పండుగ జరుపుకోవాలని తెలియని వ్యక్తులపై రంగు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సజ్జనార్ తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్లిక్ వెళ్లే రోడ్స్ పై రంగులు చల్లుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా న్యూసెన్స్ క్రియేట్ చేయవద్దని సూచించారు. బైక్స్, ఇతర వాహనాలతో గుంపులుగా తిరగడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన ఆయన హెచ్చరించారు. హోలీ సందర్భంగా కెమికల్ రంగులకు బదులు సహజ రంగులు వినియోగించాలని సూచించారు. హోలీ సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ తో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు.
Follow Us