/rtv/media/media_files/2026/06/13/khammam-2026-06-13-20-24-08.jpg)
ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల మైనర్ హిందూ బాలికపై మహ్మద్ గౌస్ పాషా అనే వ్యక్తి జరిపిన లైంగిక వేధింపులు, హత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సుధాకర్ పరామర్శించారు . బాలిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం, ఈ దారుణ ఉదంతాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ దృష్టికి సింకారు శివాజీ తీసుకెళ్లారు.
శివసేన నేతల సమాచారంతో కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ వెంటనే స్పందించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న బాలిక తల్లిదండ్రులతో ఆయన వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, అధైర్యపడొద్దని కుటుంబ సభ్యులను కోరారు. బాధిత బిడ్డకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, బాలికకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మా కూతురుకు జరిగిన అన్యాయం మరే ఇతర బిడ్డకు జరగకూడదని తల్లిదండ్రులు మంత్రి ముందు కన్నీరుమున్నీరయ్యారు.
కామాంధుడు బ్రతకడానికి వీల్లేదు
ఈ అగాయిత్యంపై శివసేన రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు గౌస్ పాషాను వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని లేదా నడిరోడ్డుపై ఉరితీయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని పేర్కొన్నారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ వద్దే హోం శాఖ కూడా ఉంది. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఈ కామాంధుడు బ్రతకడానికి వీల్లేదు" అని ఆయన స్పష్టం చేశారు. తన కూతురిని ఈ స్థితికి తెచ్చిన దుర్మార్గుడిని వదిలిపెట్టకూడదని బాలిక తండ్రి కూడా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ దారుణ ఘటన జరిగి ఆరు రోజులు అవుతున్నా బయటకు రాకుండా తొక్కేయాలని చూసిన వారికి సిగ్గుండాలని శివాజీ విమర్శించారు. ఒక హిందూ బీసీ బిడ్డపై ఇంతటి అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ లబ్ధి ఉంటేనే స్పందిస్తారా అంటూ కేటీఆర్, హరీష్ రావు, సీతక్క, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి నేతలను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఈ ఘటన కనిపించడం లేదా అని నిలదీశారు. బాధిత బాలికకు పూర్తి న్యాయం జరిగే వరకు శివసేన పార్టీ తరపున ఎంత దూరమైనా పోరాడతామని సింకారు శివాజీ స్పష్టం చేశారు.
Follow Us