/rtv/media/media_files/2026/03/24/vaishanvi-2026-03-24-21-26-19.jpg)
vaishanvi
VAISHU LOVE STORY : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో హత్యకు గురయిన యూట్యూబర్ వైష్ణవి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కట్నం విషయంలో మనస్థర్థలు రావడంతో ఆమెను భర్త హరిబాబు గొంతు నులిమి కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కట్నం విషయంలో హరిబాబు తల్లిదండ్రులు ప్రోత్సహించడం మూలంగాను హరిబాబు హత్యకు పాల్పడినట్లు వారు తేల్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ చదివిన వైష్ణవి ఆ తర్వాత MLT కోర్సులో జాయిన అయినట్లు తెలిపారు. కాగా ల్యాబ్ పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వైష్ణవి వెళ్లేది. అదే ప్రభుత్వ హాస్పిటల్‌లో హరిబాబు పేషంట్ అటెండర్‌గా పనిచేసేవాడు. అక్కడే వైష్ణవిని చూసిన హరిబాబు ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ హరిబాబు వైష్ణవి వెంట పడినట్లు పోలీసులు వెల్లడించారు. మొదట్లో హరిబాబు ప్రేమకు నో చెప్పిన వైష్ణవి ఆ తర్వాత అంగీకరించిందన్నారు.వైష్ణవి లేకుంటే బతకలేనంటూ హరిబాబు ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమవ్వడంతో వైష్ణవి అతినితో ప్రేమకు అంగీకరించింది, జీవితాంతం వైష్ణవితోనే ఉంటానంటూ హరిబాబు ఆమెను ఒప్పించాడు.
అయితే-ముందుగా హరిబాబుతో పెళ్లికి వైష్ణవి ఫ్యామిలీ నిరాకరించింది. హరిబాబు ఫ్యామిలీ కూడా వైష్ణవితో పెళ్లికి అంగీకరించలేదు. ప్రేమకు, పెళ్లికి మధ్య దాదాపు 2 సంవత్సరాల సమయం గడిచింది. అయినప్పటికీ వైష్ణవిని ప్రేమిస్తున్నానని వెంటపడటంతో వైష్ణవి ఫ్యామిలీ సహకారంతో 10 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్‌లో రీల్స్, వీడియోస్ చేస్తూ వైష్ణవి సంపాదిస్తుండటంతో వైష్ణవి ఫ్యామిలీ సూచనతో హరిబాబు ఉద్యోగం వదిలేశాడు. ఆ తర్వాత వైష్ణవితో పాటే వీడియోలు, రీల్స్ చేస్తూ ఇద్దరు సంపాదిస్తున్నారు.
కాగా వైష్ణవితో పెళ్లి ఇష్టంలేని హరిబాబు కుటుంబం అతన్ని చేరదీయకపోవడంతో అత్తగారింట్లోనే ఇల్లరికపు అల్లుడిగా హరిబాబు స్థిరపడ్డాడు. వైష్ణవి గ్రామంలోనే హరిబాబుకు 2 గుంటల స్థలం కొనిచ్చింది వైష్ణవి కుటుంబం. వారికి ఇల్లు కూడా కట్టించేందుకు వైష్ణవి ఫ్యామిలీ సిద్ధమైంది. ఐతే వైష్ణవిని వదిలేయాలంటూ హరిబాబుపై అతని ఫ్యామిలీ ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. వైష్ణవిని వదిలేసి మరో పెళ్లి చేసుకుంటే 4 ఎకరాల పొలం, 20 లక్షల కట్నం వస్తుందని హరిబాబు తల్లి, సోదరులు ఆశ చూపడంతో వైష్ణవిని వదిలించుకునేందుకు హరిబాబు ప్లాన్ వేశాడు. ఈ నెల 16న రాత్రి వైష్ణవి ప్రాణాలు తీశాడు.
16న దిండుతో మొహంపై మొత్తి, వైష్ణవి గొంతుపై బలంగా నొక్కి ఆమెను హత్య చేశాడు. అనంతరం విచక్షణ రహితంగా కత్తితో పొడవటంతో వైష్ణవి అక్కడకక్కడే మృతి చెందింది.4 నెలల ప్రెగ్నెన్సీ అని వైష్ణవి ఎంత వేడుకున్నప్పటికీ వదలని హరిబాబు ఆమెను హతమార్చాడు. వైష్ణవి పేరెంట్స్‌కు అనుమానం రాకుండా రోమాన్స్ చేస్తున్నట్లు యాక్టింగ్ చేయడంతో వారు పట్టించుకోలేదు.ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేసుకుని అత్తింటి వారు కొనిచ్చిన బండి తీసుకుని హరిబాబు పారిపోయాడు. కాగా వైష్ణవి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో హరిబాబుతో పాటు అతని తల్లి, ఇద్దరు సోదరులను అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.
Follow Us