Telangana government : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ గడ్డిమందు అమ్మకాలు నిషేధం..

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది,  ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గడ్డి మందు వినియోగం పై  నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది

New Update
FotoJet (4)

paraquat

Telangana government : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది,  ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గడ్డి మందు వినియోగం పై  నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.పారాక్వైట్ గడ్డిమందు -అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

 కాగా ఈ నిషేధం 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధిచి ప్రభుత్వం ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం -నిబంధనలు ఉల్లఘించి పారాక్వైట్ మందు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో పారాక్వైట్ గడ్డి మందును నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 
 
పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL అనే ప్రమాదకర గడ్డిమందును వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. అయితే దీన్ని తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, సమాజ, ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈ తీర్మానం చేసిందని ఆయన వివరించారు,
 
వ్యవసాయంలో గడ్డిని నిర్మూలించడం కోసం పారాక్వాట్ మందును వినియోగిస్తారు. దీని ఉపయోగించడం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సరైన రక్షణ చర్యలు చేపట్టకుండా దీన్ని వినియెగించడం వల్ల అనేక సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుందని తుమ్మల పేర్కొన్నారు. క్షణికావేశంలో  కొంతమంది ఈ రసాయనం సేవించడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు.

 పారాక్వాట్ వంటి అత్యంత విషపూరిత రసాయనాల వినియోగం సుస్థిర, సహజ వ్యవసాయ విధానాలకు విరుద్ధమని కూడా తుమ్మల అన్నారు.ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరప్ సహా అనేక దేశాల్లో  పారాక్వాట్‎పై నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.  రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని అరికట్టడం అత్యవసరమని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పారాక్వాట్‎కు బదులుగా అనేక గడ్డిమందులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిపై నిషేధం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొవాలని, పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి విజ్ఙప్తి చేశారు.  

Advertisment
తాజా కథనాలు