Train: నాలుగు గంటల్లోనే శంషాబాద్ నుంచి విశాఖ..సెమీ హైస్పీడ్ ట్రైన్ తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం సమయాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్–విశాఖల మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా కేవలం నాలుగు గంటల్లోనే గమ్య స్థానానికి చేరుకోవచ్చును. By Manogna alamuru 26 Oct 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Semi High Speed Train: ఆంధ్రా, తెలంగాణల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే రైల్వే ప్రాజెక్ట్ ప్రణాళిక కీలక దశకు చేరుకుంది. ఇందులో భాగంగా శంషాబాద్–వైజాగ్‌ల మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది. సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ ట్రైన్ నడవనుంది. ఇందులో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మించనున్నారు. ఇది విశాఖ నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ మీదుగా కర్నూలు చేరుతుంది. ఈ ప్రణాళికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లు సమాచారం. ఇది కనుక నిజం అయి పట్టాలెక్కితే తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ట్రైన్ అవుతుంది. ఇందులో శంషాబాద్, రాజమండ్రిని కూడా కలపడం మరో విశేషం. ఈ సెమీ హై స్పీడ్ కారిడార్ లో రైళ్లు గంటకు 220 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి నాలుగు గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ 8.30 గంటల్లో చేరుకుంటోంది. Also Read: Israel: ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి..1981 నాటి ఆపరేషన్ ఒపేరాతో పోలిక మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి