Rythu BHAROSA : మార్చి 31వ తేదీలోపు రైతులందరికీ రైతుభరోసా....రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. మార్చి 31 లోపు అర్హులైన అందరికీ..రైతుభరోసా ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.

New Update
Rythu BHAROSA

Rythu BHAROSA

Rythu BHAROSA : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరుపున రేవంత్‌ రెడ్డి లెక్కలేనన్ని హామీలు ఇచ్చాడు. అయితే వాటిని అమలు చేయడంలో మాత్రం కొంత ఆలస్యం అవుతోంది. అయితే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే.. ఈ పథకాలను జనవరి 26వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కార్.. విడతలవారీగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. మొదటగా ఎకరం లోపు సాగు భూమి ఉన్నవాళ్లకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఎకరం, రెండెకరాలు, మూడెకరాలు ఇలా వరుసగా డబ్బులు జమ చేస్తోంది. దీంతో.. చాలా మంది రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు అందలేదు. దీంతో చాలామంది రైతులు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు.

ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!

మంచిర్యాలలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. కీలక ప్రకటన చేశారు. మార్చి 31 లోపు అర్హులైన అన్నదాతలందరికీ.. రైతు భరోసా నిధులను వారి వారి ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మూడెకరాల సాగు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా నిధులు జమ చేసింది. ఈమేరకు రూ.1,230.98 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్ల రైతు భరోసా నిధులు అందిందని రేవంత్‌ రెడ్డి చెప్పారు..

ఇది కూడా చదవండి: శనగపిండినితో మధుమేహాన్ని నియంత్రించవచ్చా?

అయితే.. జనవరి 26వ తేదీన పైలెట్‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి.. అర్హులైన అన్నదాతలందరికీ రూ.568.99 కోట్లతో రైతు భరోసా నిధులు జమ చేసింది. ఇక.. ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎకరం వరకు ఉన్న 17 లక్షల మంది రైతులకు చెందిన 9.29 లక్షల ఎకరాల భూమికి గాను రూ.557.54 కోట్లు జమ చేసింది సర్కార్. మరోవైపు.. రెండెకరాల వరకు ఉన్న రైతులకు ఫిబ్రవరి 10వ తేదీన 13.23 లక్షల మందికి, ఫిబ్రవరి 12న రికార్డులు అప్‌‌‌‌డేట్ చేసిన 56 వేల మంది రైతులకు రూ.38.34 కోట్లతో కలిపి మొత్తం రూ.1,130.29 కోట్లు నిధులు జమ చేయగా.. అదే రోజు మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మంది రైతులకు చెందిన 20.51 లక్షల ఎకరాలకు రూ.1,230.98 కోట్లు నిధులను డైరెక్ట్ బెనిఫీషియరీ ట్రాన్స్‌‌‌‌ఫర్ ద్వారా రైతు ఖాతాల్లో జమ చేశారు.
 దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద రూ.3,487.82 కోట్ల నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం జమ చేసింది. కాగా.. మార్చి 31వ తేదీ లోపు మిగతా వారికి కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!

Advertisment
Advertisment
Advertisment