/rtv/media/media_files/2025/03/11/Z0rc9EEQOUwpEuGaA4eG.jpg)
Robots Using For Tunnel Rescue
SLBC Tunnel Updates : ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతుంది. ఈరోజు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే టన్నెల్‌లోకి అన్వీ రోబో బృందం వెళ్లింది. డేంజర్ జోన్‌లో రోబోలతో తవ్వే ప్రయత్నం చేశారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు చోట్ల తవ్వకాలు మొదలు పెట్టారు. కాగా.. సాయంత్రానికి రెండు మృతదేహాలు వెలికితీసే అవకాశం ఉంది. కేరళకు చెందిన క్యాడవర్ శునకాలు మృతదేహాల ఆనవాళ్లు పసిగట్టాయి. దాంతో ఆ ప్రాంతంలో తవ్వి ఒకరి మృతదేహం బయటకు తీశారు. అతి కష్టం మీద మరో ఐదడుగులు తవ్వారు. ఇంజనీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటు ఇటుగా మరో ముగ్గురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉంది. మిగిలిన వారు సొరంగం చిట్ట చివరి భాగం దగ్గర టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం టన్నెల్‌లో టీబీఎం మిషన్ కట్టింగ్, డీ వాటరింగ్ కొనసాగుతుంది.
Also Read : అబ్బా భలే ఉంది.. ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం AI-జనరేటెడ్ పాట
హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్ బృందం ఒక రోబోతో టన్నెల్ లోపలికి వెళ్లింది. టన్నెల్‌లో రోబోను ఎలా ఉపయోగించాలన్న అంశంపై డెమో నిర్వహించనుంది. డెమో తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్‌లోకి మరో రెండు రోబోలను రంగంలోకి దింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్, హైదరాబాద్ అన్వీ రోబోటిక్ టీమ్‌తో ఈ ఆపరేషన్ కొనసాగనుంది.. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2వ స్పాట్‌లో ఏడుగురి ఆచూకీ కోసం తవ్వకాలు జరుపుతున్నామని.. ప్రస్తుతం షిఫ్ట్‌ల వారీగా 11 ఏజెన్సీల సిబ్బంది రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ.. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ కంపెనీ బృందంతోపాటు.. 110 మంది రెస్క్యూ సిబ్బంది కూడా టన్నెల్ లోకి వెళ్లారు.. అక్కడ పరిస్థితులను బట్టి తవ్వకాలు జరుపుతున్నారు. కాగా.. ఎస్ఎల్‌బీసీ సొరంగం లోపల నీరు, బురదతో సహా పరిస్థితులు సవాలుగా మారడంతో, రెస్క్యూ సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం రోబోలను మోహరించాలని నిర్ణయించింది .
Also Read: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!
డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మంగళవారం SLBC టన్నెల్ ఆఫీసులో సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రస్తుత సహాయక చర్యల పురోగతిని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. టన్నెల్. సహాయక చర్యలలో అనుసరించాల్సిన విధి విధానాలు, రోబోటిక్స్, మెకానికల్ పరికరాల వినియోగం, మట్టి తొలగింపు ప్రక్రియ, భద్రతా చర్యలపై విస్తృతంగా చర్చించిన అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాలని అధికారులకు అవసరమైన అన్ని చర్యలు వివరించారు.
Also Read : మిచెల్ సాంట్నర్కు బిగ్ షాక్ .. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసిన బోర్డు!
SLBC టన్నెల్ లోపల జరిగే సహాయక చర్యలలో రోబోలను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మంగళవారం ఉదయం హైద్రాబాద్ కు చెందిన అన్వి రోబోటిక్స్ సంస్థకు చెందిన AI బేస్డ్ కెమెరా సదుపాయం గల రోబోటిక్ ను సంస్థ ప్రతినిధులు విజయ్ & అక్షయ్ లు లోకో ట్రైన్ లో సొరంగం లోకి వెళ్ళారు. అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన ప్రతినిధులు దగ్గర ఆఫీసులో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లను ప్రారంభించినట్లు వివరించారు.. ప్రమాద ప్రదేశంలో చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించ కుండ రోబో ల సహాయక చర్యలు ఉపయోగించుకుంటున్నట్లు వివరించారు . సహాయక చర్యల్లో కావలసిన సామాగ్రితో పాటు సహాయక బంధాలు మరోమారు కడవర్ డాగ్స్ ప్రమాద ప్రదేశానికి వెళ్లాయని తెలిపారు. ఈ సమావేశంలో, జీయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్వి రోబోటిక్స్, హైడ్రా అధికారులు, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే, కేరళకు చెందిన కడావర్ డాగ్స్ స్క్వాడ్ సహా సహాయక చర్యల్లో పాల్గొంటున్న అన్ని బృందాల అధికారులు హాజరయ్యారు.
Also Read : రాజకీయ భవిష్యత్తుపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ప్రకటన!
Also Read : లక్నోకు బిగ్ షాక్.. ఫస్టాఫ్‌కు మయాంక్ దూరం!