Rajya Sabha elections : రాజ్యసభ ఎన్నికలు.. తెరపైకి కొత్త ముఖాలు

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు ఎవరికీ కేటాయించాలనే విషయంలో అగ్ర నాయకుల మధ్య చర్చలు నడిచినట్లు తెలిసింది. వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

New Update
FotoJet (15)

Rajya Sabha elections.. new faces on the scene

Rajya Sabha elections : తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్ల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చర్చలు మొదలు పెట్టింది. సీట్లు ఎవరికీ కేటాయించాలనే విషయంలో అగ్ర నాయకుల మధ్య చర్చలు నడిచినట్లు తెలిసింది. వికారాబాద్ వేదికగా జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో పాల్గొనడానికి వచ్చిన రాహుల్‌ గాంధీ తో పాటు పార్టీ అగ్రనేతలతో రాజ్యసభ సభ్యుల ఎంపికపై సోమవారం కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా పలువురు నేతలు రాజ్యసభ సీటు ఆశీస్తున్న నేపథ్యంలో సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర నేతలకు పార్టీ అగ్రనేతలు సూచించినట్లు తెలిసింది.

కాగా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి టికెట్‌ రాకపోయినప్పటికీ పార్టీ గెలుపుకు కృషి చేసిన నేతలకు ఈ సీట్లు కేటాయించాలనే అంశంపై పార్టీ నాయకుల మధ్య చర్చ జరిగింది. కాగా, రాజ్యసభ ఎంపీల రేసులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

2026, ఫిబ్రవరి 18న భారత ఎన్నికల సంఘం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను  విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవీ కాలం ముగియనుంది. వీరి పదవి కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుండటంతో  రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది. కాగా రాజ్యసభ ఎన్నికకు సంబంధంచి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ కావడంతో రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. కాగా రాజ్యసభ సభ్యుల ఎంపికపై  రాహుల్ గాంధీతో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నట్లు తెలిసింది.  

Advertisment
తాజా కథనాలు