Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలే...వర్షాలు! తెలంగాణలో రాగల ఒకటి రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. By Bhavana 29 Sep 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Rain Alert to Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆది, సోమవారాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. Also Read: అమెరికాలో విజృంభిస్తున్నహెలెన్..52మంది మృతి, 30 లక్షల మంది అంధకారంలో.. #telangana-rains #ts-weather-update సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి