HMDA: అంబేడ్కర్‌ విగ్రహ ప్రాంగణంలోకి ప్రజలకు అనుమతి

హైదరాబాద్‌ సందర్శకులకు శుభవార్త.. ఎట్టకేలకు హుస్సేన్‌ సాగర్‌ తీరంలోని 125  అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌  విగ్రహ దర్శనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. నేడు అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల నిర్వహణకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది.

New Update
 World's Tallest Dr.B.R. Ambedkar Statue

World's Tallest Dr.B.R. Ambedkar Statue

World's Tallest Dr.B.R. Ambedkar Statue

: హైదరాబాద్‌ సదర్శకులకు శుభావార్త.. ఎట్టకేలకు హుస్సేన్‌ సాగర్‌ తీరంలోని 125  అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌  విగ్రహ దర్శనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. నేడు అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల నిర్వహణకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది.

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!
 
రాష్ర్టంలో  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమిపాలయి, కాంగ్రెస్‌ అధికారంలో కి రావడంతో గత ప్రభుత్వం నిర్మించిన అనేక కట్టడాల విషయంలో ప్రభుత్వం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి.  ముఖ్యంగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ దర్శనానికి అనుమితివ్వకపోవడం, ప్రభుత్వం కూడా నివాళులు అర్పించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈసారి జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌ తీరంలో 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వీవీఐపీల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ నివాళులర్పించేలా చర్యలు చేపట్టింది.

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

అంబేడ్కర్‌ విగ్రహం పాదాల దాకా వెళ్లేందుకు ఇప్పటివరకు అవకాశం లేదు. అయితే, సోమవారం వీవీఐపీలను, వీఐపీలను ఇందుకు అనుమతించనున్నారు. అంబేడ్కర్‌ విగ్రహ పీఠం(పాత పార్లమెంటు భవనం ఆకారంలో నిర్మించారు)లో ఏర్పాటు చేసిన లైబ్రరీ, మ్యూజియం సందర్శనకు కూడా ప్రజలను అనుమతించనున్నారు. అయితే, అవి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

 ఈ నేపథ్యంలో.. అంబేడ్కర్‌ జీవితం నుంచి ప్రేరణ పొందే ఘట్టాలను చిత్రిస్తూ రూపొందించిన కళాఖండాలను సేకరించడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో విద్యార్థులు, కళాకారులకు పోటీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరుగుతున్న ఈ పోటీల్లో 20 బృందాల దాకా పాల్గొంటున్నాయి. పెయింటింగ్‌, ఇతరత్రా ఆర్ట్‌ సామగ్రి కోసం హెచ్‌ఎండీఏ ఒక్కో బృందానికి రూ.10వేల చొప్పున అందజేసింది. ఈ బృందాలు రూపొందించిన కళాఖండాలను అంబేడ్కర్‌ జయంతి రోజున మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఇందులో ఉత్తమమైన మూడింటిని ఎంపిక చేసి వారికి నగదు బహుమతులు అందిస్తారు. ఆ కళాఖండాలను అంబేడ్కర్‌ మ్యూజియంలో శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నారు.

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vidadala Rajini : మాజీమంత్రికి బిగ్ షాక్....మరిది అరెస్ట్

మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించారు. క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని గోపీపై కేసు నమోదైంది.

New Update
Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినితోపాటు గోపీపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అతడ్ని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే


గోపిని  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ ను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
 
కాగా.. మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు