ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి అప్పగింత ! ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ డా.జీఎన్ సాయిబాబా (58) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే సాయిబాబా కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహాన్ని సోమవారం గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. By B Aravind 13 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ డా.జీఎన్ సాయిబాబా (58) హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుముసిన సంగతి తెలిసిందే. అయితే సాయిబాబా కోరిక మేరకు కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. ప్రస్తుతం నిమ్స్ మార్చురీలో ఉన్న ఆయన పార్థివదేహాన్ని అక్టోబర్ 14న సోమవారం ఉదయం 8 గంటలకు బయటకు తీసుకురానున్నారు. Also Read: హైదరాబాద్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఇవి ముఖ్యం! అక్కడని నుంచి 9 గంటల కల్లా గన్‌పార్క్‌కు చేరి అక్కడ పావు గంటసేపు ఉంచుతారు. అక్కడి నుంచి 10 గంటల కల్లా మౌలాలి కమాన్ దగ్గర ఆయన నివాస స్థలమైన శ్రీనివాసా హైట్స్‌కు చేరి ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచనున్నారు. ఇక మధ్యాహ్నం 2.30 కి చివరి ఊరేగింపుగా బయలుదేరి సాయంత్రం 4 గంటల కల్లా సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజ్‌లో ఆయన పార్థివదేహం అప్పగించనున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2014లో ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టయ్యారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో ఆయన 10 ఏళ్ల పాటు నాగ్‌పూర్ జైల్లోనే గడపాల్సివచ్చింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మానవహక్కుల ఉద్యమ కారుడు, రచయిత, విద్యావేత్తగా సాయిబాబా గుర్తింపు పొందారు. Also Read: బాబా సిద్ధిఖీ హత్యకు కారణం.. సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత్యమేనా? మరోవైపు సాయిబాబా మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా సంతాపం తెలిపారు. ఆయన మరణం పౌర హక్కుల ఉద్యమానికి తీరని లోటన్నారు. అట్టడుగు వర్గాలపై జరిగే అన్యాయాలకు సాయిబాబా గళం వినిపించారని.. తన స్వేచ్ఛకు, ఆరోగ్యానికి ముప్పు ఉన్నా కూడా లెక్కచేయకుండా అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెస్ సాయిబాబా అకాల మరణం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేశారు. దేశలో జరుగుతున్న ప్రజాఉద్యమాలకు సాయిబాబా మరణం తీరని లోటని అన్నారు. #telugu-news #professor-sai-baba #gandhi-hospital మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి