WhatsApp group :"పోలీస్ మామలు’ అంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో అంతా ఎగ్జిట్‌..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవటానికి 1024 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. దానికి "పోలీస్ మామలు’ అని పేరు పెట్టుకున్నారు. అనుకోకుండా గ్రూపులోకి ఎస్ఐ ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాకయ్యారు.

New Update
FotoJet

Police Mamalu

Police Mamalu WhatsApp group : మందుబాబులకు వచ్చినన్ని ఆలోచనలు మరెవరికీ రావు. వారి క్రియేటివిటీ కూడా మాములుగా ఉండదు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవటానికి వారంత కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. దానికి "పోలీస్ మామలు’  అని పేరు పెట్టుకున్నారు. ఎక్కడైన  డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటే చాలు ఆ గ్రూపులో మిగిలిన వారు తప్పించుకునేలా అందులో పోస్టులు పెట్టి వారిని సేవ్‌ చేస్తున్నారు. అందులో వచ్చే సమాచారం ఆధారంగా మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. అలా ఒక్కరిద్దరూ కాదు సుమారు 1024 మంది ఆ గ్రూపులో సభ్యులుగా ఉన్నారు.

ఇదిలా ఉండగా అనుకోకుండా ఓ ట్రాఫిక్ ఎస్‌ఐ గ్రూప్‌లోకి ఎంట్రీ అవ్వటంతో సభ్యులు షాక్ తిన్నారు. భయంతో ఒకరి తర్వాత ఒకరుగా అంతా గ్రూపు నుంచి ఎగ్జిట్ అయ్యారు.  గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ వింత సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతని వాహనానికి సంబంధించిన పత్రాలు తనిఖీ చేయడం కోసం అతడి ఫోన్ చెక్ చేస్తుండగా ‘పోలీస్ మామలు’ అనే వాట్సాప్ గ్రూప్ కనిపించింది. అనుమానం వచ్చిన ట్రాఫిక్‌ ఎస్‌ గ్రూపులోకి వెళ్లి చెక్‌ చేయగా ఆసక్తికర విషయం బయటపడింది. ఏ రోజు ఎక్కడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారనే పూర్తి సమాచారం అందులో ఉంది. ఆ విషయమై వ్యక్తిని విచారించగాడ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది వాహనదారులు కలిసి ఆ గ్రూప్‌ను క్రియేట్ చేసుకున్నారనే విషయం తెలిసింది. ఆ గ్రూప్‌లో వచ్చే సమాచారం ఆధారంగా సభ్యులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలనుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు అతను తెలిపాడు. విషయం అర్థమైన ఎస్‌ఐ గ్రూపులోని సభ్యులకు షాక్ ఇచ్చే పని చేశారు. ఆయన ఆ గ్రూపులో జాయిన్ అయ్యారు. జాయిన్‌ అవ్వడమే కాకుండా ఒక వీడియో రికార్డు చేసి పెట్టాడు. 

వీడియోలో ' అరె మామ.. నేను ట్రాఫిక్‌ ఎస్‌ ఐ ని మామ.. నా మీద గ్రూపు పెట్టిడ్లు కదా.. వాట్సాప్‌ గ్రూపు, నేనే ట్రాఫిక్‌ ఎస్‌ ఐని. గోదావరిఖని మున్సిపల్‌ చౌరస్తాలో వెయికిల్‌ చెక్‌ చేస్తున్న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. రండిరా..మామ రండి..చూసుకుందాం..చాలా రోజులవుతుందిరా బయ్‌.. నా మీద మీరు గ్రూపులు పెట్టుకున్నారు. తప్పించుకు తిరుగుతున్నారనే విషయం తెలుసు. చాలా రోజుల నుంచి వెతుతుకున్న  దొరుకలేదు. ఈ రోజు దొరికిండ్రు. 1024 మంది గ్రూపులో ఉన్నారు. ఎవర్నీ వదిలిపెట్ట అంటూ ఆయన వీడియో పోస్ట్‌ చేశారు. అంతే.. తమ గ్రూప్‌లో ఎస్ఐ జాయిన్ అయ్యాడని తెలియగానే సభ్యులందరూ భయపడిపోయారు.వెంటనే గ్రూప్ నుంచి ఒకరి తర్వాత ఒకరుగా అందరూ ఎగ్జిట్ అయ్యారు.   ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అందరూ నవ్వుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు