Yadadri: యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం: ఈవో

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు పెద్ద షాకే ఇచ్చారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తున్నట్లు ఓ కీలక ప్రకటన చేశారు.

New Update
Yadadri: యాదాద్రి భక్తులకు బిగ్ అలర్ట్.. వారికి నో ఎంట్రీ!

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు పెద్ద షాకే ఇచ్చారు. అద్భుతమైన శిల్పకళతో అబ్బురపోయేలా తీర్చిదిద్దిన ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. 

Also Read:  బ్రెయిన్ డెడ్‌ అయిన యువతి చికిత్స పొందుతూ  మృతి

ఆలయ శిల్పకళను చూసి..

అయితే.. స్వామివారిని దర్శించుకోవటంతో పాటు.. ఆలయ శిల్పకళను చూసి మంత్రముగ్దులవుతున్నారు. ఈ క్రమంలోనే.. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. అయితే.. ఫొటోలు, వీడియోలు తీసుకోవటం రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. ఆలయ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధిస్తున్నట్లు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావు మంగళవారం ప్రకటించారు.

Also Read:  'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా.. భక్తుల మనోభావాలు, విశ్వాసానికి ఆటంకం ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  అధికారులు చెబుతున్నారు. అయితే.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగితే ఆలయ అధికారులకు ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే.. వ్యక్తిగత కార్యక్రమాలకు ఆలయాన్ని ఉపయోగించుకుంటే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందన్న కారణంతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Also Read: కమలాహారిస్‌కు బిల్‌గేట్స్ భారీ విరాళం.. ఎందుకంటే?

అయితే.. ఇటీవల హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురితో కలిసి యాదాద్రి ఆలయ మాడవీధుల్లో ఫొటో షూట్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తాను, ఆయన కుమార్తె శ్రీనిక తమ సోషల్ మీడియాల్లో పెట్టారు.దీంతో సోషల్ మీడియాలో వాటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఎమ్మెల్యే లాంటి బాధ్యతమైన పదవిలో ఉండి.. ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఫొటోషూట్లు చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. నిజానికి.. ఆలయంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతి లేదు. అయితే.. స్వామివారి దర్శనం అనంతరం బయటికి వచ్చిన తర్వాత మాడవీధుల్లో మాత్రం ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు.

Also Read:  ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్!

అక్కడ ఫొటోగ్రాఫర్లే ఫ్యామిలీ ఫొటోలు తీస్తూ.. అప్పటికప్పుడు ప్రింట్ ఇస్తుంటారు. కాగా.. భక్తులు తాము స్టాండ్‌లో డిపాజిట్‌  చేసిన మొబైల్స్ తీసుకొచ్చుకుని.. పైన ఫొటోలు దిగుతూ మురిసిపోతుంటారు. మాడ వీధుల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవటంపై ఎలాంటి నిషేదం లేకపోవటంతో.. గమనార్హం. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి ఫొటోషూట్ వివాదాస్పదంగా మారుతుండటంతో.. పలువురు ఇదే విషయాన్ని ప్రస్తావించటంతో.. ఆలయ అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు