పట్నం నరేందర్‌రెడ్డికి బిగ్ షాక్.. ఆ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు!

కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బిగ్ షాక్ తగిలింది. లగచర్ల ఘటనలో జిల్లా కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మెరిట్స్‌ ఆధారంగా బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలించాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

author-image
By srinivas
New Update
Patnam nagender reddy

TG News: కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బిగ్ షాక్ తగిలింది. లగచర్ల ఇష్యూలో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలంటూ నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. లగచర్ల ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఇటీవల క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా బుధవారం దీనిని తిరస్కరించిన న్యాయస్థానం.. మెరిట్స్‌ ఆధారంగా బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలించాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

A1 నిందితుడిగా నరేందర్ రెడ్డి.. 

ఇక లగచర్లలో ప్రభుత్వం అధికారులపై దాడికేసులో నరేందర్ రెడ్డి A1 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. లగచర్లలో ప్రభుత్వం అధికారులపై దాడికేసులో నరేందర్ రెడ్డి A1 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ దాడి కుట్రలో నరేందర్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద జాగింగ్ కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, లగచర్ల దాడి ఘటనకు సంబంధించి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన మరోమారు హైకోర్టును ఆశ్రయించారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు