తెలంగాణకు పసుపు హెచ్చరిక.. రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు వాతావరణం
తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బాల్క సుమన్, గువ్వల బాలరాజు, శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, రెడ్యానాయక్ తదితరులను బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, సొనాలలో 8.5, బేల 9.2, బజార్ హత్నుర్లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకోవాలన్నది ప్ఱభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఉండే 55 సీట్లలో కనీసం 20 సీట్లు మగాళ్లకు రిజర్వ్ చేసే ఛాన్స్ ఉందని, దీనిపై త్వరలోనే ఆర్టీసీ అధికారులనుంచి ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.
కొన్ని రోజులుగా తెలంగాణాలో రికార్డు స్థాయిలో సాధారణం కన్నా అతితక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలై ఉదయం 10 గంటల వరకు తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బిజినెస్ రంగంలో రాణించాలనుకుంటున్నవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని పలు కాంట్రక్టర్ల నియామకానికి ఆసక్తిగల బిడ్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆసక్తిగల వారు డిసెంబర్ 24 వరకూ సంప్రదించాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 9-11 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ తెలిపింది. బీఆర్ఎస్ కేవలం 3-5 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ ఓట్ల శాతం పెంచుకునే అవకాశం ఉందని.. కానీ కేవలం 1-3 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలో మహిళా దొంగలు హల్ చల్ చేశారు. కామారెడ్డికి చెందిన కవిత.. సరిత, సానియా అనే స్నేహితులతో కలిసి బుధవారం దొమకొండ వ్యాపారి కాశీనాథ్ ఇంటి దోపిడికి పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి స్థానికుల సాయంతో ముగ్గురిని పోలీసులకు పట్టించారు.