/rtv/media/media_files/2025/03/29/jmYuL3hEQKfc2lPiM7j9.jpeg)
nizamsagar 123 Photograph: (nizamsagar 123)
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేష్ అనే యువకుడు ఓ మహిళను చంపిన డెడ్‌బాడీ తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. కమల మృతదేహాన్ని తరలిస్తుండగా యువకుడు పోలీసులకు దొరికిపోయాడు. దాస్‌నగర్ శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. కారు ఆపకుండా రాజేష్ తప్పించుకు వెళ్లాడు.
Also read: Mallareddy: ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్!
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు రాజేష్ కారును వెంబడించారు. నిజాంసాగర్ కెనాల్ ప్రాంతంలో కారును వదిలేసి డ్రైవర్ రాజేష్ పారిపోయాడు. అనంతరం కారును తనిఖీ చేసిన పోలీసులు డిక్కీలో మహిళ శవం కనిపించింది. మృతురాలి పేరు కమలగా గుర్తించారు. రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బంగారం కోసమే సదరు మహిళలను చంపినట్లు రాజేష్ పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నాడు.