/rtv/media/media_files/2025/03/30/pDV2JNv8l985TuNtPPHZ.jpg)
kamareddy 10110 Photograph: (kamareddy 10110)
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. పండగపూట కుటుంబంలో నలుగురు మృతి చెందారు. బట్టలు ఉతకడానికి ఆదివారం మౌనిక ఆమె ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకుతో కలిసి చెరువుకు వెళ్లింది. తల్లి బట్టలు ఉతుకుతుండగా ముగ్గురు పిల్లలు చెరువులోకి స్నానానికి దిగారు. చెరువులో ఓ ప్రదేశంలో లోతైన గుంట ఉంది. అందులో పడి పిల్లలు నీటమునిగారు. వారిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించగా ఆమె కూడా నీటమునిగి మరణించింది.
Also read: Transgenders: డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. ట్రైన్‌లో యువకుడిని తొక్కి చంపిన హిజ్రాలు
పిల్లలూ చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులు తల్లి మౌనిక(26), పిల్లలు మైథిలీ(10), అక్షర(8), వినయ్ (5)గా గుర్తించారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో గ్రామంలో ఇలా జరగడంతో విషాఛాయలు అలుముకున్నాయి. భార్య తరపు బంధువులు భర్తే హత్య చేశాడని ఆందోళన చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Also read: BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..?