New Year 2025: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్‌లో రూ.149కే ఈవెంట్లో పాల్గొనే అవకాశం!

తెలంగాణలో న్యూఇయర్ సందర్భంగా పలు ఈవెంట్లు ఏర్పాటు చేశారు. బుక్‌మైషోలో అతి తక్కువ ధరకే టికెట్ కొని పాల్గొనవచ్చు. ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్ కోసం రూ.149, దుర్గం చెరువు వద్ద ఈవెంట్ కోసం రూ.299, బేగంపేట హాకీ స్టేడియంలో ఈవెంట్ కోసం రూ.199 ధరను నిర్ణయించారు.

New Update
new year events

new year events 2024-2025

రేపటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి స్వాగతం పలకనున్నారు. దీంతో డిసెంబర్ 31 రాత్రి దేశ వ్యాప్తంగా హంగామా ఓ రేంజ్‌లో ఉండబోతుంది. స్నేహితులు అంతా ఒక్కటై పార్టీలు చేసుకోనున్నారు. ఈ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్లు సైతం రెడీ అయ్యాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈవెంట్లు జరగనున్నాయి. అందులో హైదరాబాద్‌ అద్భుతమైన న్యూ ఇయర్ వేడుకలు 2025 కోసం సిద్ధమైంది.

ఇది కూడా చూడండి: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?

డిసెంబర్ 31, 2024 రాత్రి కోసం ఉత్తేజకరమైన ఈవెంట్‌లు ఏర్పాటు అయ్యాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఘనంగా వేడుకలు, కచేరీలు, ఇతర ఈవెంట్‌లతో 2025కి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. లైవ్‌ మ్యూజిక్ నుంచి విలాసవంతమైన విందుల వరకు అంతా రెడీ అయింది. అయితే ఈ ఈవెంట్ కోసం వేలకు వేలు ఖర్చు చేయాలేమో అని చాలా మంది భ్రమపడతారు.

కానీ అలాంటిదేమీ లేదు. ఎందుకంటే ఈ ఈవెంట్‌ టికెట్ బుక్‌ మై షోలో కొనుక్కోవచ్చు. ఇందులో చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లో అతి తక్కువ ధరలోనే ఈవెంట్‌ను లైవ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఈవెంట్ స్పాట్‌లు ఉన్నాయి.. బుక్ మై షోలో వాటి ధర ఎంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రిజం బౌల్డర్ హిల్స్

హైదారాబాద్‌లోని ప్రిజం బౌల్డర్ హిల్స్‌లో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇది రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్‌లో ప్రముఖ తెలుగు గాయకులు కార్తీక్, సునీతలు ప్రత్యక్ష ప్రదర్శనలు చేయనున్నారు. అలాగే ఆ ఈవెంట్‌లో మల్టీ-బ్రాండెడ్ ఫుడ్ కోర్ట్‌లు, కిడ్స్ ప్లే జోన్ వంటివి ఏర్పాటు చేశారు. వీటి టికెట్ రూ.1,699 ప్రారంభ ధరతో బుక్‌ మై షోలో అందుబాటులో ఉన్నాయి.

ప్రిజం క్లబ్ అండ్ కిచెన్

హైదరాబాద్‌లోని ప్రిజం క్లబ్ అండ్ కిచెన్‌లో మరో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇది కూడా రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్‌లో రామ్ మిర్యాల ద్వారా ప్రత్యక్ష ప్రదర్శన ఉంటుంది. బుక్ మై షోలో వీటి ధరలు రూ.2,499 నుంచి ప్రారంభం అవుతాయి. 

Novotel HICC

Novotel HICCలో రాత్రి 8 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం అవుతుంది. బాలీవుడ్ DJ, లైవ్ బ్యాండ్ ఉంటుంది. దీనికి చీఫ్ గెస్ట్‌గా నటి శ్రీలీల రానున్నారు. ఈ ఈవెంట్ టికెట్ ధర బుక్ మై షోలో రూ.1,499 నుంచి ప్రారంభం అవుతుంది. 

ఉప్పల్ స్టేడియం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇది రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్‌ టికెట్ ధర చాలా తక్కువగా ఉంది. బుక్ మై షోలో కేవలం రూ.149లకే ప్రారంభం అవుతుంది. 

ఇది కూడా చూడండి: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

దుర్గం చెరువు

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు దగ్గర బిగ్ బాష్ NYE 2025 పేరుతో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇది రాత్రి 7 నుంచి ప్రారంభం అవుతుంది. బుక్ మై షోలో రూ.299 నుంచి టికెట్ ధర ప్రారంభం అవుతుంది. 

రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల నుండి ప్రారంభం అవుతుంది. టిక్కెట్‌లు రూ. 2,000 నుంచి బుక్‌మైషోలో ప్రారంభమవుతాయి.

బేగంపేట హాకీ స్టేడియం

బేగంపేట హాకీ స్టేడియంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల నుండి ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్‌కి నటి దక్షా నాగర్కర్ హాజరుకానున్నారు. టిక్కెట్‌ ప్రారంభ ధర రూ.199 నుంచి బుక్‌మైషోలో ప్రారంభం అవుతుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు