Medigadda: మేడిగడ్డపై రేవంత్ సర్కార్ కు ఊహించని షాక్! TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని NDSA నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ పరీక్షల ఫలితాలు వస్తేనే బ్యారేజీల భవితవ్యంపై పూర్తి నివేదికను అందించగలమని తేల్చిచెప్పింది. By V.J Reddy 15 Oct 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి Medigadda: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన మేడిగడ్డ, అన్నారం (Annaram), సుందిళ్ల బ్యారేజీలు (Sundilla Barrage) కుంగిపోవడంపై ఇటీవల జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (NDSA) నిపుణుల కమిటీ పరిశీలించింది. ఇప్పటికే మూడు సార్లు ఈ కమిటీ పరీక్షలు నిర్వహించింది. కాగా ఇటీవల కురిసిన వర్షాలు వారికి అడ్డంకుల మారాయి. దీనికి ప్రధాన కారణం వరద ఉదృతి కొనసాగడం. అయితే... ఈ పలు మార్లు పరీక్ష చేసిన ఈ కమిటీ.. వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని తమ అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఆ పరీక్షల ఫలితాలు వస్తేనే బ్యారేజీల భవితవ్యంపై పూర్తి నివేదికను అందించగలమని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో (Uttam Kumar Reddy) ఢిల్లీలో ఈ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రాజెక్ట్ పై కీలక విషయాలను మంత్రితో చర్చించారు. ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా! 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఎలా? కాగా ఈ కమిటీపై రాష్ట్ర సర్కార్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ తో తుది నివేదిక కోసం నిపుణుల కమిటీతో పాటు అధికారుల బృందం సమావేశమైంది. బ్యారేజీల పునరుద్ధరణపై తుది నివేదికను అందించాలని మంత్రితో పాటు అధికారులు కమిటీని పదేపదే రిక్వెస్ట్ చేసిన.. కమిటీ నిపుణులు మాత్రం మంత్రి అడిగిన దానికి బిన్నంగా సమాధానం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: రూ.9 కే బీమా.. దీపావళి వేళ ఫోన్‌పే అదిరిపోయే శుభవార్త! పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి, ఫలితాలు అందించకపోతే నివేదికలు ఇవ్వలేమని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. మళ్లీ పరీక్షలు చేసి నివేదిక వచ్చే వరకు ఆగాలంటే.. డిసెంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు ఆగితే.. రబీలో లోయర్, మిడ్, అప్పర్ మానేరుతో పాటు శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల కింద 20 లక్షల ఎకరాలకు నీరు అందించడం కష్టం కానుంది. దీంతో ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ నవంబర్ లో పరీక్షలు!... వరద ప్రవాహం ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం లేనందున మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నవంబర్ నెలలో పరీక్షలు చేసి తుది నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కన్నెపల్లి పంప్ హౌస్‌కు కొద్దిదూరంలో మట్టికట్ట కట్టి, దానిపై జియోట్యూబ్‌లతో రక్షణ కల్పించి, నీటిని నిలిపివేయడం ద్వారా అన్నారంలోకి, ఆ తర్వాత సుందిళ్లలోకి పంపింగ్ చేసి, రబీతో పాటు తాగునీటి అవసరాలు తీర్చాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ఆరోజే కీలక ప్రకటన! #telangana-news #cm-revanth-reddy #medigadda-barrage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి