Telangana: తెలంగాణలో స్పెషల్ పోలీస్ స్టేషన్లు.. ఇకపై వారికి చుక్కలే!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేక నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌, సైబర్ క్రైమ్ పీఎస్‌‌‌‌‌‌‌‌ల తరహాలోనే కేసులు దర్యాప్తు చేస్తారు. 

author-image
By srinivas
New Update
rerewrrrr

Narcotics Police Stations : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌  పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా జిల్లాల్లోని అన్ని యూనిట్స్‌‌‌‌‌‌‌‌లో ఈ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయనుండగా లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌, సైబర్ క్రైమ్ పీఎస్‌‌‌‌‌‌‌‌ల తరహాలోనే కేసులను దర్యాప్తు చేయనున్నాయి. టీజీ యాంటీ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలో ఇందులో కార్యక్రమాలు నిర్వహించనుండగా.. ప్రతి పీఎస్‌‌‌‌‌‌‌‌కు డీఎస్పీ స్టేషన్ హౌస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నారు. 

ఇది కూడా చదవండి: విడాకుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అందులో భార్యకు హక్కు!

Also Read :  మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..!

ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదయ్యే కేసులు..

ఇక ఇందులో భాగంగానే వరంగల్‌‌‌‌‌‌‌‌ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్స్‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదయ్యే కేసులను దర్యాప్తు చేస్తారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు రిజిస్టర్ చేసే కేసులను నార్కొటిక్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేయనున్నారు. లా అండ్ ఆర్డర్ పీఎస్‌‌‌‌‌‌‌‌లలో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై నియమించనున్నారు. ఇప్పటికే టీ న్యాబ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించగా.. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరును కనబరిన పోలీస్ సిబ్బందిని నార్కొటిక్స్ స్టేషన్ లలో నియమించనున్నారు. ఇక ప్రస్తుతానికి హైదరాబాద్ నాంపల్లి, హైదరాబాద్ పాత కలేక్టరేట్‌‌‌‌‌‌‌‌, హఫీజ్‌‌‌‌‌‌‌‌పేట, రాచకొండ,‌‌‌‌‌‌ సరూర్‌‌‌‌‌‌‌‌నగర్ లో నార్కొటిక్స్ స్టేషన్లను‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Video: చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్‌ చేసి..!

Also Read :  ఎర్త్ మ్యాగ్నెట్ వేగంతో మార్పులు..ప్రళయం తప్పదా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగి సీజన్ కింద బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత వర్షాకాలంలో క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ అందజేసినట్లు తెలిపారు.

New Update
Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలోని 25,65,000 మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే గత వర్షా కాలం సీజన్ కింద క్వింటాకు రూ.500 చొప్పున రూ.1,700 కోట్ల రూపాయలు బోనస్‌గా కూడా చెల్లించామని తెలిపారు. ఇదే కాకుండా రైతు భరోసా కింద రూ.9 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

క్వింటాకు బోనస్ ఇస్తామని..

రెండు పంటల సీజన్లలో మొత్తం 3 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ఇందులో సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా నిరుపేదలకు అందజేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలో ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో కూడా బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు బోనస్ ఇస్తున్న మొదటి ప్రభుత్వ కూడా దేశంలో ఇదేనని అన్నారు.

ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పొంగులేటి వెల్లడించారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కేంద్రంలో కొనుగోలు చేసిన ప్రతీ క్వింటాకు మద్దతు ధరతో బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment