కాంగ్రెస్ పార్టీ లేకపోతే బానిసలుగా ఉండేవాళ్లం: నిర్మాత బండ్ల గణేష్ ..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, భట్టి పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’పాదయాత్రలో పాల్గొంటానని సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. భట్టిని కలిసేందుకు బండ్ల గణేష్ సూర్యాపేటకు వెళ్లి భట్టి యాత్రలో పాల్గొన్నారు. అయితే వీరిద్దరి కలయిక ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది.