Telangana Accidents : నెత్తురోడిన తెలంగాణ.. సూర్యాపేటలో 6, వరంగల్ లో నలుగురు..
తెలంగాణలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటలో ఆరుగురు మృతి చెందగా..వరంగల్ లో నలుగురు విద్యార్థులు మరణించారు.
తెలంగాణలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటలో ఆరుగురు మృతి చెందగా..వరంగల్ లో నలుగురు విద్యార్థులు మరణించారు.
మోడీ హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టి ముస్లిం మైనారిటీలపై పరోక్ష దాడులకు పాల్పడుతున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా, వ్యవస్థకు భంగం కలిగించే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండడం ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని అన్నారు.
TG: విద్యుత్ ఉత్పత్తిని పెంచినట్లు చెప్పడంలో వాస్తవం లేదని అన్నారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్, మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవని తేల్చి చెప్పారు.
TG: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రెండు సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ జిల్లాకి గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా రేవంత్ కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు.
TG: కేసీఆర్కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లాలో వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. 8 వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కేసీఆర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రమాదం తప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వీడియో వైరల్ అవుతోంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. వరుసగా కోమటిరెడ్డిపై ఈ పొగడ్తలు ఏంటన్న అంశం హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.