/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
Nalgonda: సూర్యాపేట జిల్లా బీబీ గూడెం సమీపంలో కారు, బస్సు ఢీకొన్న ఘటనలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారికి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన గడ్డం రవీందర్ అతడి భార్య రేణుక, కూతురు రితిక లుగా గుర్తించారు. వీరిని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని కంఠాయపాలెం వాసులుగా తెలిపారు. మృతుల శరీర భాగాలు నుజ్జునుజ్జు కావడంతో ఘటన స్థలంగా భయానకంగా మారింది.
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
నెల్లూరులో మరో ప్రమాదం
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు వరుణ్ కుమార్ (18), నందకిషోర్ (18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి సురేంద్ర (40) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మనుబోలు మండలం గోట్లపాలెం సమీపంలో జరిగింది. మృతులు ఊటుకూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!