Nagarjuna Sagar Canal : ఖమ్మంలో కాలువకు మరోసారి గండి

ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి పడింది. కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు గండి పడగా.. దానికి అధికారులు కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేశారు. తాజాగా కాలువకు మరోసారి గండి పడడంతో అధికారుల పనితీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

author-image
By V.J Reddy
New Update
KHAMMAM

Khammam: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు మరోసారి గండి పడింది. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగర్ కాల్వకు గండి పడింది. అయితే దానికి కోట్లు వెచ్చించి అధికారులు పరమత్తులు చేసి పడ్డ గండిని పూడ్చేశారు. తాజాగా నిన్న సాయంత్రం నాగార్జున సాగర్ లో నీళ్లను అధికారులు విడుదల చేశారు. దీంతో సాగర్ కాల్వలో పూడ్చిన దగ్గరే మరోసారి గండి పడింది. వెంటనే ఇది గమనించిన అధికారులు అప్రమత్తమై నీటి సరఫరాను ఆపేశారు. ఇటీవల రిపేర్ చేసిన దానికి గండి పడడంపై స్థానికులు, రైతులు అధికారుల పనితీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సీఎం రేవంత్ ఆదేశాలతో..

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలోని గ్రామాలు నీటముగిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా ఎంతో మంది ఇల్లు లేని వారుగా మారారు, వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. అలాగే ప్రాణనష్టం కూడా జరిగింది. ఇదిలా ఉంటే వరదల కారణంగా నాగార్జున సాగర్ కాలువల కట్టలకు పలు చోట్లు గండ్లు పడిన విషయం తెలిసిందే. దీని కారణంగా వందల  మీటర్ల మేర కట్టలు తెగిపోయాయి. 

ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన గండ్లను పూడ్చి వేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కోట్ల రూపాయలు వెచ్చించి పూడ్చివేత పనులను అధికారులు ప్రారంభించారు. కూ సు మం చి మం డ లం పా లేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు గండి పూడ్చి వేత పనులు పూర్తి చేశారు. అయితే పనులు పూర్తి కావడంతో అధికారులు శనివారం నీటిని విడుదల చేశారు. దీంతో మరోసారి కాల్వకు గండి పడింది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగలు.. పాల ప్యాకెట్ కోసం వెళ్తే రూ.2 కోట్లు కొట్టేశారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు