Musi: ఇప్పుడే కూల్చివేతలు వద్దు.. అలా చేద్దాం: మూసీపై రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే! మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ముందుగా నిర్మాణాలు అధికంగా లేని ప్రాంతాల్లో ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బాఫూఘాట్, నాగోల్ ప్రాంతంలో ఈ మేరకు పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. By Nikhil 27 Oct 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం.. మూసీ పునరుజ్జీవం. మూసీని దక్షిణ కొరియాలోని హాన్ నది మాదిరిగా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ మేరకు అక్కడికి అధికారులు, మంత్రుల బృందం సైతం వెళ్లి వచ్చింది. అయితే.. ఈ ప్రాజెక్ట్ కోసం మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 13 వేల నివాసాలను ఖాళీ చేయించడం ప్రభుత్వానికి సవాల్ గా మారింది. నదీ గర్భంలో నివాసం ఉండే వారిలో మెజార్టీ ప్రజలు ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లిపోయారు. అయితే.. బఫర్, ఎఫ్టీఎల్ లలో నివసించే వారు మాత్రం వెళ్లడానికి అస్సలు అంగీకరించడం లేదు. లక్షలు, కోట్లు విలువైన తమ నివాసాలను వదిలి వెళ్లేదే లేదంటూ వారు ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం వీరి ఆందోళనలకు మద్దతు ఇస్తున్నాయి. ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆద్వర్యంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఫోర్త్ సిటీని నిర్మించబోతుంది.భావి తరాల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా, సియోల్ నగర అభివృద్ధిని నమూనాగా తీసుకుని, తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన వాణిజ్య నగరాన్ని… pic.twitter.com/pKNuGdQojf — Telangana Congress (@INCTelangana) October 23, 2024 Also Read : నమ్మించి కొట్టేశారు కదరా.. రూ.8.15 కోట్లు స్వాహా చేసిన కేటుగాల్లు..! సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం.. సోషల్ మీడియాలోనూ కూల్చివేతలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. దీంతో రేవంత్ సర్కార్ సైతం వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. నదీ మొత్తం ఒకే సారి కాకుండా.. దశల వారీగా మూసీ ప్రక్షాళన చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మొదటగా నిర్మాణాలు లేని ప్రాంతంలో మూసీ ప్రక్షాళన చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నార్సింగ్ నుంచి భాపూఘాట్ మూసీ పక్కన పెద్దగా నిర్మాణాలు లేవు. దీంతో మొదటగా ఇక్కడ మూసీ ప్రక్షాళన చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. నాగోలు దాటిన తర్వాత కూడా పెద్దగా నివాసాలు లేని ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఈ ప్రాంతాల్లో సియోల్ లోని చుంగేచాన్ నది తరహాలో పునరుద్ధరణ చేపట్టాలన్నది ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఇది పూర్తి చేస్తే తమకు కలిసిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో తాము చేపట్టబోయే అభివృద్ధిపై ప్రజల్లోనూ క్లారిటీ వస్తుందని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ప్రతిపక్షాలకు సైతం కౌంటర్ ఇచ్చినట్లు అవుతుందన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. Also Read : ఈ పప్పు మాంసంతో సమానం.. మరి మీరు తింటున్నారా? #revanth-reddy #hydra #musi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి