Big Scam :  తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమని...ఏకంగా రూ. రూ.850 కోట్లు ...

నగరంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలని అమాయకులను నమ్మించారు.

New Update
Big Fake investment scam

Big Fake investment scam

Big Scam: నగరంలో మరో భారీ స్కామ్‌ వెలుగు చూసింది. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. అమాయకులకు అధిక లాభాలు ఆశ చూపి ఏకంగా రూ.850 కోట్లు కొట్టేశారు. తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని అమాయకులను కేటుగాళ్లు నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ బురిడీ కొట్టించారు. మెుబైల్ అప్లికేషన్ ప్రారంభించి వసూళ్లకు పాల్పడ్డారు.

Also Read: Breaking: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..

హైదరాబాద్‌లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్పేరుతో 2021లో కొంతమంది కంపెనీ పెట్టారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫోంజి స్కీమ్‌ ను తీసుకువచ్చారు. ఏజెంట్లను నియమించుకుని అమాయకులకు వల పన్నారు.చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క హైదరాబాద్లోనే ఫాల్కన్ సంస్థ రూ.850 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు.

Also Read :  ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

తక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ప్రజలను బురిడీ కొట్టించారు. మెుబైల్ అప్లికేషన్ ప్రారంభించి వసూళ్లకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 6,979 మంది బాధితుల నుంచి 17 వేల కోట్లు వసూలు చేసిన ఈ ఘరానా మోసం గురించి తెలిసి పోలీసులే కంగుతిన్నారు. బ్రిటానియా, గోద్రెజ్, అమెజాన్ వంటి సంస్థలో పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫాల్కన్కు అనుబంధంగా 14 సంస్థలు ఏర్పాటు చేసి ఈ వసూళ్లకు పాల్పడ్డారు.కేవలం 45 నుంచి 180 రోజుల్లోనే 11 నుంచి 22 శాతం రిటన్స్ వస్తాయని చెప్పడంతో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల నుంచి రూ.9 లక్షల వరకూ పెట్టుబడుల పేరుతో వసూలు చేశారు కేటుగాళ్లు. అందినకాడికి దోచుకున్న తర్వాత ఈ ఏడాది జనవరి 15 క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులంతా సైబరాబాద్ పోలీసులను ఫిర్యాదు చేశారు.

Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు

దీంతో సంస్థ వైస్ ప్రెసిడెండ్ పవన్ కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు. పట్టుపడిన ఇద్దరూ అమర్ దీప్ కుమార్, అర్యాన్ సింగ్, యుగంధర్ సింగ్ అనే ప్రధాన నిందితులతో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. వీరంతా సేకరించిన రూ.1,700 కోట్లలో రూ.850 కోట్లు తిరిగి చెల్లించారని, మిగతా రూ.850 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారని వెల్లడించారు. ఆ నగదును 14 షెల్ కంపెనీలకు దారి మళ్లించారని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు ఇప్పటికే దుబాయ్కు పారిపోయారు.  చైర్మన్ అమర్దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సందీప్ దుబాయ్కు పారిపోయారు. ఈ ముగ్గురిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 

Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

మొత్తం ఈ సంస్థకు చెందిన 20 మందిపై సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంస్థకు చెందిన ఆరుగురు ఉద్యోగులు ఇండియాలోనే ఉన్నారని భావిస్తున్న పోలీసులు వీరి కోసం వెతుకులాట సాగిస్తున్నారు. ఈ ఎఫ్ఐడీ సంస్థకు చెందిన బిజినెస్ హెడ్ పవన్ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. ఒకరు అమర్ దీప్ కుమార్, మరొకరు వి.కావ్య. మిగిలిన వాళ్లంతా కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కావడం గమనార్హం. పోలీసులు ఏ1గా అమర్ దీప్ కుమార్ పేరును, ఏ2గా కావ్య పేరును చేర్చారు. ఇన్వెస్టర్ల నుంచి ఒక మొబైల్ యాప్ ద్వారా ఈ ఎఫ్ఐడీ సంస్థ డబ్బులను కలెక్ట్ చేసింది.

Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

కనిష్టంగా 15 రోజులు.. గరిష్టంగా ఆరు నెలల కాల పరిమితి వరకూ పెట్టుబడులు పెట్టొచ్చని ఇన్వెస్టర్లను ఈ సంస్థ నమ్మించింది. కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్లకు లాభాలను చూపించింది. ఒక పెద్ద మొత్తం కాగానే కుచ్చుటోపీ పెట్టింది. ఈ కంపెనీ ఆఫీస్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉంది. జనవరి 10 నుంచి ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు డబ్బులు ఎగ్గొట్టింది.

Also Read: వామ్మో.. పెట్ డాగ్ ప్రియులు జాగ్రత్త సుమీ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నాకు మంత్రి పదవి.. అద్దంకి సంచలన ఇంటర్వ్యూ!

కేసీఆర్ బహిరంగ సభలకే వస్తాడని.. బయటకు రాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంత్రి పదవి విషయంలో తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అద్దంకి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు