Attempted murder : మైనర్‌ ప్రేమ.. దానికి ఒప్పుకోలేదని......

వయసుతో సంబంధం లేకుండా నేటి యువత ప్రేమ పేరుతో ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించిన అమ్మాయి కాదంటే చాలు కాలయముళ్ల మారి హత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. అయితే ఇది ఒక భిన్నమైన ప్రేమకథ.  

New Update
Attempted murder

Attempted murder

Attempted murder : వయసుతో సంబంధం లేకుండా నేటి యువత ప్రేమ పేరుతో ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించిన అమ్మాయి కాదంటే చాలు కాలయముళ్ల మారి హత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. అయితే ఇది ఒక భిన్నమైన ప్రేమకథ.  

 ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు! 

నాలుగేళ్లుగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను.. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని.. నేరుగా ప్రియురాలి తండ్రికే ఓ ప్రియుడు ప్రపోజల్ పెట్టాడు. విషయం వినగానే ఏ తండ్రైన ఆవేశపడుతాడు. అలా అడిగిన అబ్బాయిమీద చేయి చేసుకుంటాడు. లేదా అబ్బాయి బాగుంటే అబ్బాయి జాబ్, కుటుంబం, ఆస్తితో పాటు ఇతర విషయాలను ఎంక్వైరీ చేసి ఒకే అనుకుంటే ఒకే అని, లేదంటే లేదు అని చెబుతారు. అయితే ఇక్కడ అవేమీ అడ్డుకాలేదు. కానీ పెళ్లికి వచ్చిన సమస్య వయస్సు. ఎందుకంటే ఆ ప్రపోజల్‌ పెట్టిన యువకుడి వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ఇంకా నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నా అని చెప్పడం అంటే 12 ఏళ్ల వయస్సునుండే ప్రేమిస్తున్నట్లు. ఇక ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే ఆ బాలిక వయస్సు కూడా 16 ఏళ్లే.

ఇది కూడా చదవండి: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్‌!

అయితే ఇదంతా విన్న తండ్రి ఏమాత్రం ఆవేశపడలేదు. చిన్నవయస్సు పిల్లతనంతో అలా అడిగాడు అనుకున్న ఆయన ఏ మాత్రం ఆవేశపడకుండా సింపుల్‌గా పెళ్లీడు వచ్చాక చూద్దాంలే అని చెప్పి పంపించివేశాడు. ఇక్కడి వరకు బానే ఉంది. అలా చెప్పడమే ఆ తండ్రి చేసిన తప్పయింది.ఆ పిల్లవయస్సు వెనుక ఒక రాక్షసుడు దాగిన్నాడని గుర్తించలేకపోయాడు. వయసు విషయం పక్కన పెట్టి పెళ్లికి అంగీకరించలేదని బాలిక తండ్రిపై పగ పెంచుకున్నాడు. అంతే కాదు తన పెళ్లికి అడ్డంగా ఉన్న ఆయనను తప్పించాలని ప్లాన్‌ చేశాడు. ఏకంగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో కలకలం రేపింది.

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

వివరాల ప్రకారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఓ బాలుడు మేస్త్రీగా పని చేస్తున్నాడు. బాలుడు ఉంటున్న అదే కాలనీకే చెందిన బాలికను నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామని బాలికను అడుగగా ఆమె అంగీకరించలేదు. దీంతో నేరుగా బాలిక తండ్రి వద్దకు వెళ్లి తమకు పెళ్లి చేయమని అడిగాడు. బాలుడి మాటలకు విస్తుపోయిన బాలిక తండ్రి ఇద్దరి చిన్నపిల్లలని, పెళ్లీడు వయస్సు రాలేదని ఆ వయస్సు వచ్చాక మాట్లాడదామని నచ్చజెప్పి పంపించేశాడు. దాంతో ఆయనపై కోపం పెంచుకున్న బాలుడు వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహ్మద్‌ తౌసిఫ్‌ ఉల్లాతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. శనివారం అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న బాలిక తండ్రిపై కత్తెరతో దాడిచేసి, పలుమార్లు పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. 

Also Read: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడితోపాటు, అతడికి సహకరించిన మహ్మద్‌ తౌసిఫ్‌ ఉల్లాను అరెస్టు చేశారు. నిందితులను కోర్టు ఎదుట హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించినట్టు నిర్మల్ సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.  

ది కూడా చదవండి: Hyderabad: టాప్‌-10లో హైదరాబాద్‌ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక పర్యాటకుల సందర్శనతో రికార్డు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !

నాంపల్లి నియోజకవర్గం మురాద్‌నగర్‌లోని ఓ భవనంలో​ లిఫ్ట్‌ ​కుప్పకూలింది. దీంతో ఫోర్త్‌ ​ఫ్లోర్‌లో ​నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌​కు పడిపోయింది. ఈ ప్రమాదంలో సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది.

New Update
Hyderabad Lift Accident:

Hyderabad Lift Accident:

ఈ మధ్య కాలంలో లిఫ్ట్‌ కులిన ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో నగర ప్రజలు.. లిఫ్ట్‌ ఎక్కాలంటేనే భయ పడుతున్నారు. తాజా నాంపల్లి నియోజకవర్గంలో మరో ఘటన నగర వాసులను భయభ్రతులకు గురి చేస్తోంది. మురాద్‌నగర్‌లోని ఓ భవనంలో​ లిఫ్ట్‌ ​కుప్పకూలింది. దీంతో ఫోర్త్‌  ​ఫ్లోర్‌లో ​నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌​కు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. చోటి మసీద్‌ ​సమీపంలోని నాకో షమ్స్ అపార్ట్‌మెంట్ ఉంది. దానిలోని ​ఫోర్త్‌  ​ఫ్లోర్‌లో ఉంటున్న మక్సుద్ ఇంటికి ఆదివారం రాత్రి లంగర్‌హౌస్‌లో ఉండే బంధువు సయ్యద్ నసీరుద్దీన్, మైమూనా బేగం, సబీనా బేగం, ముగ్గురు పిల్లలు వచ్చారు. ఫోర్త్‌  ​ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్​ ఎక్కారు. ఫోర్త్‌  ​ఫ్లోర్‌ వరకు వెళ్లిన లిఫ్ట్.. ఒక్కసారిగా కిందికి పడి గ్రౌండ్‌ ఫ్లోర్‌​లో ఆగింది. లిఫ్ట్‌లో ఉన్న సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది.  

Also Read :  కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం

ఇది కూడా చదవండి: డయాబెటిస్ ఉన్నవారు జిమ్‌ చేస్తే ఏమవుతుంది?

Hyderabad Lift Accident At Nampally

గాయపడిన క్షతగ్రతులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న.. ఎమ్మెల్యే మజీద్ ​హుస్సేన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు అనంతరం ప్రమాదం జరిగిన పరిస్థితిని పరిశీలించారు. లిఫ్ట్‌ ​ప్రతిసారీ రిపేర్ అవుతోందని, గతంలో లిఫ్టు మధ్యలో ఇరుక్కుపోయిందని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. లిఫ్ట్ రిపేర్‌లో ఉన్న విషయం తెలియక నసీరుద్దీన్, కుటుంబ సభ్యులు ఎక్కారని, లిఫ్ట్‌ ​దగ్గర ఎలాంటి సూచిక బోర్డులు పెట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. నాంపల్లి నియోజకవర్గంలో వరుసగా లిఫ్టు ప్రమాదాలు జరగటంతో కాలనీ వాసులు లిఫ్ట్‌ ఎక్కాలన్న భయ పడుతున్నారు.  

ఇది కూడా చదవండి: ఆదిలాబాద్‌లో దారుణం..12 ఏళ్ల బాలికను అడవిలోకి తీసుకెళ్లి.. దగ్గరుండి ఇద్దరితో రేప్ చేయించిన మహిళ!

Also Read :  ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కు పెను ప్రమాదం.. విడిపోయిన బోగీలు.. వివరాలివే!



(latest-telugu-news | today-news-in-telugu | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | accident | lift)

Advertisment
Advertisment
Advertisment