ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన ప్రతి మాటకూ కౌంటర్ ఇస్తూ మంత్రి పొన్నం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ చేసిన తెలంగాణ ఏమైనా మీ అయ్యా జాగీరా? అన్న వ్యాఖ్యలపై మంత్రి పొన్నం తీవ్రంగా మండిపడ్డారు. అవును.. తెలంగాణ బరాబర్ మా అయ్యా జాగీరే.. ఇక్కడున్న 4 కోట్ల మంది ప్రజల జాగీరే ఈ తెలంగాణ అని గట్టిగా సమాధానమిచ్చారు. పవన్ కల్యాణ్ మాటల్లో తీవ్రమైన అహంకారం కనిపించిందని, తెలంగాణ సమాజంపై ఆయనకు ఎందుకంత అక్కసు అని మంత్రి ప్రశ్నించారు.
ఏపీలో తన రాజకీయ పరిస్థితి ఏంటో పవన్ కల్యాణ్ తానే స్వయంగా చెప్పుకున్నాడు. ఆంధ్రాలోనే తనకు సరైన దిక్కులేదు.. ఇక తెలంగాణలో ఆయనకు ఏముంటుంది?" అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తాము ఏపీ ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ.. ఏపీ ప్రజలు ఇక్కడ ఉండొద్దని, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని మేము ఎక్కడా అనలేదు. అమెరికా వాళ్లే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటే.. పక్కనే ఉన్న ఏపీ వాళ్లు పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం? అని ఆయన ప్రశ్నించారు.
ఆయనొక పెయిడ్ ఆర్టిస్ట్
పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్న తీరును తప్పుబడుతూ ఆయనొక పెయిడ్ ఆర్టిస్ట్ అని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, ఆ తర్వాత కానీ ఈ ప్రాంతానికి పవన్ కల్యాణ్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? అని నిలదీశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే.. ఈసారి పవన్ కల్యాణ్‌కు బీజేపీ వాళ్లు స్క్రిప్ట్ సరిగ్గా రాసివ్వలేదనుకుంటా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు పవన్ వస్తూ పోతాను అంటే మాకు ఎలాంటి సమస్యా లేదని, కానీ ఇక్కడ రాజకీయం చేస్తానంటే ఒప్పుకోమని చెప్పారు.
నువ్వు సొంతంగా ఆంధ్రాలోనే సరిగ్గా గెలవలేకపోయావు.. ఇక ఇక్కడికి వచ్చి ఏం పీకుతావ్? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజా గాయకుడు గద్దర్ పట్ల గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను, ప్రవర్తనను దళిత సంఘాలు ఒకసారి ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
Ponnam prabhakar : మిస్టర్ పవన్.. తెలంగాణ మా అయ్యా జాగీరే : మంత్రి పొన్నం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన ప్రతి మాటకూ కౌంటర్ ఇస్తూ మంత్రి పొన్నం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.