Ponguleti: తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీపి కబురు అందించారు. సంక్రాంతి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశామని, లబ్ది దారులందరికీ న్యాయం చేస్తామన్నారు. అలాగే సంక్రాంతి పండుగకే రైతులకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం డిసెంబర్ 5న యాప్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
నేలకొండపల్లి మండల పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్...
— Ponguleti Srinivasa Reddy (@mpponguleti) December 2, 2024
• గత సంవత్సరం డిసెంబరు మూడున ఎన్నికల ఫలితాలు వచ్చాయి
• మీదీవెనలతో మంత్రి ని అయ్యా
• ఎన్నికల వరకే రాజకీయాలు, ఆతర్వాత అభివృద్ధి పైనే దృష్టి
• ప్రజలకు ఇచ్చిన హామీలను… pic.twitter.com/e1fLaD5oxR
కావాలనే కుట్రపూరితంగా ప్రచారం..
ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపట్టబోతుందని చెప్పారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతూ నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూస్తున్నాం. ఇప్పటికే 50 వేల మందికి నియామక పత్రాలు అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నాం. గురుకులాలపై కావాలనే కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరిగ్గా సంవత్సరం క్రితం మార్పు కావాలని , ఇందిరమ్మ ప్రభుత్వం కోసం భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు.
— Ponguleti Srinivasa Reddy (@mpponguleti) December 2, 2024
గత సంవత్సర కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటున్నాం. మరో పది రోజుల లోపే పేదలందరికీ న్యాయం జరిగే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టుకోబోతున్నం… pic.twitter.com/LNu65GxRyQ