/rtv/media/media_files/2025/03/06/tTPkRFKNjBLHh4HH836r.jpg)
konda sureka pet dog Photograph: (konda sureka pet dog)
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రేమగా పెంచుకున్న ఆమె పెంపుడు కుక్క ఆకస్మిక మరణంతో కన్నీరుమున్నీరయ్యారు. ఆమె కుటుంబంలో ఎంతో ఇష్టంగా చూసుకునే పెంపుడు కుక్క పేరు హ్యాపీ. ఆమె పెంపుడు కుక్క హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయింది. మూగ జీవం హ్యాపీని ఇంట్లో మనుషులతో సమానంగా చూసుకునే వారు. హ్యాపీ చనిపోయేసరికి మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మంత్రి కొండా సురేఖ పెంపుడు కుక్క మృతి.. వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి..
— RTV (@RTVnewsnetwork) March 6, 2025
ఇష్టంగా పెంచుకున్న హ్యాపీ చనిపోవడంతో శోకసంద్రంలో కొండా
కుటుంబం.
అంతిమ సంస్కారాలు నిర్వహించిన మంత్రి కొండా సురేఖ.#kondasurekha #viralvideo #RTV pic.twitter.com/qERl68jP7B
హ్యాపీకి మంత్రి కుటుంబం ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తీరని బాధలో మంత్రి కొండా సురేఖ, ఆమె సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్ని రోజులు వారి మధ్య ఉన్న హ్యాపీ జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మంత్రి వెక్కి వెక్కి ఏడ్చారు. చివరి సారి హ్యాపీని చూసి మోకాళ్లపై దండం పెట్టారు మంత్రి సురేఖ. హ్యాపీ అంతిమ సంస్కారాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆమెకు పెంపుడు కుక్క పట్లు ఉన్న ప్రేమ నెటిజన్లు సైతం కంటతడి పెట్టింస్తోంది.
Also read: హోం వర్క్ చేయలేదని.. టీచర్ ఏం చేసిందంటే?