మేడిగడ్డలో లోపాలు.. ఆ బ్లాక్‌ మళ్లీ నిర్మించాల్సిందే .. ఎన్డీఎస్‌ఏ సంచలన రిపోర్ట్

మేడిగడ్డ బ్యారేజీలో ప్లానింగ్ నుంచి నిర్వహణ వరకు లోపాలు ఉన్నట్లుగా నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్‌ లోని ఏడో బ్లాక్‌ కూల్చాల్సిందేనని  ఇప్పటికే సిఫార్సు చేసిన  ఎన్డీఎస్‌ఏ మళ్లీ నిర్మించాలని సూచించింది.

New Update
medigadda

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ప్లానింగ్ నుంచి  నిర్వహణ వరకు లోపాలు ఉన్నట్లుగా నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్‌ లోని ఏడో బ్లాక్‌ కూల్చాల్సిందేనని  ఇప్పటికే సిఫార్సు చేసిన  ఎన్డీఎస్‌ఏ మళ్లీ నిర్మించాలని సూచించింది. అయితే   ఈ బ్లాకును మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్‌ను రూపొందించే బాధ్యతను కేంద్ర జలసంఘానికి(సీడబ్ల్యూసీ) అప్పగించాలని సూచించినట్టుగా తెలుస్తోంది.    కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ రెండు వారాల క్రితమే రిపోర్టును అందజేయగా దీనిపై  మూడ్రోజుల క్రితం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ చర్చించినట్లు సమాచారం. ఇందులోని ముఖ్యమైన అంశాలను  ఎన్డీఎస్‌ఏ, జలసంఘం, జల్‌శక్తి అధికారులకు చంద్రశేఖర్‌ అయ్యర్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించినట్లు సమాచారం.  

చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో 

2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుగింది. దీంతో ఏడో బ్లాక్ పాటు కొన్ని పియర్స్‌ దెబ్బతిన్నాయి. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ పరిశీలించి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో వైఫల్యాల వల్ల దెబ్బతిన్నట్లుగా గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గతేడాది మార్చి 2న చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఎన్డీఎస్‌ఏ నియమించింది.  బ్యారేజీలను అధ్యయనం చేసి వాటి పరిస్థితిని అంచనా వేసి ఏయే చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలని కోరింది.  మేడిగడ్డతో పాటుగా కాళేశ్వరంలోని మిగితా అన్నారం, సుందిళ్లను కూడా అధ్యయనంలో చేర్పించింది. ఈ కమిటీ  2024 మే1న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. బ్యారేజీలలో నీటిని నిల్వ చేయకుండా గేట్లు తెరిచి ఉంచాలని, పలు పరీక్షలు చేయించాలని సూచించింది. 

మేడిగడ్డ బ్యారేజీకు సంబంధించి అన్ని పరీక్షలు పూర్తి అయ్యాక పలు సిఫార్సులతో తుది నివేదికను ఇచ్చింది. బ్యారేజీల పరిస్థితి, వైఫల్యాలకు కారణాలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ నివేదికలో పొందుపరిచింది. నివేదికలో   డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని, మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను తొలగించి మళ్లీ నిర్మించాల్సి ఉంటుందని నివేదికలో వెల్లడించింది.  అంతేకాకుండా మేడిగడ్డ బ్యారేజీ కాలమ్స్‌లోనూ లోపాలున్నట్లు గుర్తించిన కమిటీ..   బ్యారేజీ పైభాగంలో సీకెంట్‌ పైల్స్‌ నాణ్యత కూడా సరిగా లేదని అభిప్రాయపడింది. తుది నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాతనే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే   అవకాశం ఉంది.

Also read :   Asha Workers: ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

EX MLC Jeevan Reddy Vs MLA Sanjay Kumar : మళ్లీ వేడెక్కిన జగిత్యాల రాజకీయాలు..ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్సీ మధ్య వార్‌

జగిత్యాల నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకరిపై మరొకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. జీవన్ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటో అర్థం కావడం లేదనిసంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

New Update
Jeevan Reddy Vs MLA Sanjay Kumar

Jeevan Reddy Vs MLA Sanjay Kumar

కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఓ న్యాయం.. మిగతా వారందరికీ మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పలేదా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన వెంట తిరిగి అనుకూలంగా పని చేసిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, డీసీసీ ఛైర్మన్లు సహా చాలా మందిని కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి చేర్చుకున్నారంటూ ఆరోపించారు.తాను చేస్తే ఒప్పు.. మిగతా వాళ్లు చేస్తే తప్పన్నట్లు ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు ఇవే చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెప్పారని, మరి మీ స్థానంలో కొత్త నాయకత్వం రావొద్దా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జీవన్ రెడ్డికి నీతులు చెప్పాలని అనుకోవడం లేదని, ఆయన హుందాగా నడుచుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చురకలు అంటించారు.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!
 
 పేదలకు లబ్ది చేకూరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది. ప్రజల్లో సన్న బియ్యంపై ఉన్న అపోహలను తొగించేందుకు ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గంలోని ఓ రేషన్ కార్డు లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్ కుమార్.. సోమవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

Also Read :  Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

Advertisment
Advertisment
Advertisment