PM Modi: రేపు తెలంగాణకు మోడీ.. షెడ్యూల్ ఇదే!
రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
రఘునందన్ రావుకు బీజేపీ షాక్ ఇచ్చింది. తొలి జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదు. మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయనకు కాకుండా అంజిరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో కిడ్నాప్ అయిన పాపను పోలీసులు రక్షించారు. ఆ చిన్నారి ఇంట్లో కేర్‌టేకర్‌గా చేరిన షాజహాన్ అనే మహిళ.. ఆ పాప తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎత్తుకెళ్లింది. ఎంజీబీఎస్‌లో జహీరాబాద్ బస్సు ఎక్కిన ఆమెను పోలీసులు పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.
BRS ఎంపీ బీబీ పాటిల్‌ను పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి తలనొప్పిగా మారింది. పాటిల్ చేరికను జహీరాబాద్ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చెప్పట్టారు. పాటిల్‌కు ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీ మూడో స్థానానికి పడిపోతుందని వాపోతున్నారు.
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో కారు దిగి కాషాయ జెండా కప్పుకున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్కు రాజీనామా చేసే ఆలోచలనలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించినచోటే మరో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు వెళ్తున్న కారు కంట్రలోతప్పి పల్టీలు కొట్టడంతో ఒకరు మరణించారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల వివరాలు తెలియాల్సివుంది.
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1, 521 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి ఉండదు.
కాంగ్రెస్‌పై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని మండిపడ్డారు. ఈ నిర్ణయంపై ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.