CM Revanth Reddy: పటాన్ చెరులో సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ-LIVE
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పటాన్ చెరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పటాన్ చెరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం ఈరోజు ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు ఆధ్వర్యంలో గజ్వేల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు హాజరుకానున్నారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు కామారెడ్డికి వెళ్లి రోడ్ షో పాల్గొననున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఈ రోజు కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనజాతర సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. మరికొద్ది సేపట్లో ఈ సభ ప్రారంభం కానుంది. ఈ మీటింగ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. నర్సాపూర్, సరూర్నగర్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4.00 PM గంటలకు నర్సాపూర్, 6.00 PM గంటలకు సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.
TG: కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా బాంబులు పేలుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. అయోధ్య రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఒక్క మోడీకే సాధ్యమన్నారు.
TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు మాజీ గవర్నర్ తమిళిసై. రాహుల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు తనకు.. బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని అన్నారు.
1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సొంత సీటు రాయబరేలీని కాదని.. ఇక్కడి నుంచి ఎందుకు బరిలోకి దిగారు? ఆమెపై పోటీ చేసిందెవరు? తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
TG: కేసీఆర్, హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకు వచ్చానని అన్నారు సీఎం రేవంత్. ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసుల చేత కేసులు పెట్టించే పరిస్థితి వస్తుందని అన్నారు.