నిన్న ఏటూరునాగారంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తో ఏజెన్సీ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక.. ఏజెన్సీ గ్రామాల ప్రజలు బిక్కు బిగ్గుమంటూ గడుపుతున్నారు. మరో వైపు మావోయిస్టులు వారోత్సవాలు జరుపుకుంటున్నారు. దీంతో ఏజెన్సీలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. పెద్ద ఎత్తున బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ములుగు, ఎటూరు నాగారం, భూపాలపల్లి, ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హిట్ లిస్టులో ఉన్న నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది కూడా చూడండి: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్.. 14 ఏళ్ల తర్వాత భారీ ఎన్ కౌంటర్.. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో జరిగిన అతిపెద్ద ఎన్ కౌంటర్ ఇది. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. చనిపోయిన వారిలో కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, గోలపు మల్లయ్య అలియాస్ మధు, ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ముస్సాకి జమున, జైసింగ్, కిషోర్, కామేష్ ఉన్నారు. ఇది కూడా చూడండి: పుష్ప-2పై టీడీపీ ఎంపీ ట్వీట్.. వెంటనే డిలీట్ అయితే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అన్నంలో విషం కలిపిన స్పృహ కోల్పోయిన తర్వాత చంపారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో 12 మంది చనిపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్ కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..