Maoist Party కి ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో అగ్రనేత సుజాత?

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67ఏళ్ల సుజాత వైద్యచికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా పక్కా సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

New Update
Maoist leader Kishenji wife Sujatha Akka

మావోయిస్ట్ దివంగత అగ్రనేత కిషన్ జీ సతీమణి

మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ దివంగత అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ సతీమణి మవోయిస్టు పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ అప్పట్లో ఒక సంచలనం. కిషన్‌ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆయన సోదరుడు సైతం మావోయిస్ట్‌ పార్టీలో కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అతను అజ్ఞాతంలో ఉన్నారు. 

ఇది కూడా చదవండిః నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

సుజాత కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కిషన్‌జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి, హోంమంత్రి చిదంబరానికి నేరుగా సవాల్ విసిరిన మావోయిస్టుగా సంచలనం సృష్టించారు. ఆపై 2011లో పశ్చిమ బెంగాల్‌ జార్‌గ్రామ్‌లోని బురిషోల్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పోలీసులు సుజాత కోసం వెతుకుతున్నట్లు తెలియవచ్చింది. తాజాగా ఆమెను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

మావోయిస్టు పార్టీ మహిళా అగ్రనేత సుజాత అరెస్ట్

ఇది కూడా చదవండిః సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ కల్పన అలియాస్ మైనా అలియాస్ పద్మ అలియాస్ ఝాన్సీను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 67 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు సుజాత. అయితే ట్రీట్మెంట్ కోసం బస్తర్ అడవులను వీడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా హైదరాబాద్ వస్తున్న క్రమంలో పక్కాగా అందిన సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆమెను కొత్తగూడెంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఆపై సుజాతను పోలీసులు హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం దీని గురించి ఏ విషయం చెప్పడంలేదు. ఇదంతా తప్పుడు ప్రచారమని వారు అంటున్నారు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని.. అదంతా మీడియా ప్రచారమని అంటున్నారు. దీంతో చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. నిజంగానే సుజాత అరెస్టయ్యారా? లేక లొంగిపోయారా? అనే దాని గురించి చర్చించుకుంటున్నారు. ఈమెపై రూ. కోటి రివార్డు కూడా ఉంది. ఇదిలా ఉంటే మరోపక్క మహబూబాబాద్ బస్టాండ్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు.

ఇది కూడా చదవండిః మత్తు స్ప్రే చల్లి, న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్‌ పై మరో కేసు నమోదు

వయోభారంతో లొంగుబాటుకు ప్రయత్నాలు 

సుజాత వయోభారంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని మరోపక్క వార్తలు వస్తున్నాయి. అందువల్లనే ఆమె సొంత జిల్లా అయిన మహబూబ్ నగరకు చేరుకుని అక్కడ తనకున్న పరిచయాల ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల దండకారణ్యం, అయీజ్ మద్ అడవుల్లో పోలీసులు, భద్రతాదలాల నిర్బంధం పెరిగిపోయింది. అలాంటి సమయంలో వయోభారం, అనారోగ్యం సమస్యలతో ఇబ్బంది పడుతున్న సుజాత లొంగిపోవడానికి నిర్ణయించకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సుజాతకు సంబంధించిన పక్కా సమాచారం రెండురోజుల కిందటే పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండిః విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?

సుజాత 43 ఏళ్లు నక్సలైట్/మావోయిస్టు పార్టీల్లో

మహబూబ్ నగర్ కు చెందిన సుజాత డిగ్రీ చేయడానికి హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ తో పరిచయం అయింది. ఈ క్రమంగా విప్లవ భావాల వైపు ఆకర్షితురాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా విప్లవబాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళలు ఇప్పటికే వివిధ ఎన్ కౌంటర్లలో చనిపోయారు. కాగా సుజాత సుమారు 43 ఏళ్లు నక్సలైట్/మావోయిస్టు పార్టీల్లో పని చేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు