అద్దె ఇంట్లో వ్యభిచారం.. దంపతులు అరెస్ట్!

మంచిర్యాలలోని పద్మావతి కాలనీలో మహ్మద్‌ మొయిన్‌-అవంతి అనే దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర 5 మొబైల్‌ ఫోన్లు, కండోమ్‌ ప్యాకెట్‌ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళను సఖీ సెంటర్‌కు తరలించారు. 

New Update
prt

 

TG Crime: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వ్యభిచారం గుట్టు రట్టైంది. అద్దె ఇంట్లో దంపతులు నడిపిస్తున్న చీకటి దందాను గుర్తించిన పోలీసులు విటులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏలూరుకు చెందిన ఓ మహిళకు భారీ మొత్తంలో డబ్బులు ఆశచూపి వ్యభిచారం చేసేందుకు రప్పించగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి విటులతోపాటు దంపతులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఈ మేరకు మంచిర్యాల పట్టణం రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పద్మావతి కాలనీలో శ్రీనివాస్‌నగర్‌కు చెందిన సత్తమ్మ అనే మధ్యవర్తి ద్వారా మహ్మద్‌ మొయిన్‌-అవంతి అనే దంపతులు అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే స్థానికుల సమాచారంతో ఆ గృహంపై ఎస్‌ఐ రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి దాడి చేశారు.  ఒక్కో విటుడి నుంచి రూ. 1500 తీసుకుంటున్నట్లు గుర్తించారు. అమ్మాయిలను పంపించే సత్తమ్మకు రూ. 500, గృహం నిర్వహిస్తున్న దంపతులు రూ. 500, మిగతా రూ. 500 సదరు మహిళకు ఇస్తున్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర 5 మొబైల్‌ ఫోన్లు, కండోమ్‌ ప్యాకెట్‌ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత మహిళను సఖీ సెంటర్‌కు తరలించినట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HYD: హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్లో ప్రాంతాల్లో ఇవి జరిగాయి. 

New Update
ed

హైదరాబాద్ లో సురానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈ డీ అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ కంపెనీల ఛైర్మన్ నరేంద్ర సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్ళల్లో, ఆఫీస్ుల్లో తనిఖీలు నిర్వహించింది. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారన్న అనుమానంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. నాలుగు గంటలకి ఈడీ దాడులు చేశారు. మొత్తం రెండు టీములతో ఈడీ సోదాలు చేసింది. బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడి అధికారులు సోదాలు చేస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక ఈడి బృందాలు నాలుగు ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహిస్తున్నాయి.

రుణాలు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు..

సురానా గ్రూపు చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను పొందింది. కానీ వాటిని చెల్లించకుండా రుణాలను ఎగ్గొట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాంతో పాటూ మనీలాండరింగ్తో పాటు విదేశాలు డబ్బులు తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకు ముందు సురానా గ్రూప్స్ పై సీబీఐ కేసు కూడా నమోదైంది. ఈ కారణంగానే సురానా అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలప్ మెంట్స్ కంపెనీ  ఆఫీసుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు సంస్థల ఆర్థిక లావాదేవీలు, అప్పులు లాంటి వాటిపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.

 today-latest-news-in-telugu | ed | hyderabad | raids 

Also Read: AP: విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్..99పైసలకే భూమి లీజు

Advertisment
Advertisment
Advertisment