SLBC tunnel: 37 రోజులవుతున్నా లోకో ఇంజిన్‌ మాత్రమే బయటకు.. టన్నెల్‌‌లో దొరకని ఆచూకీ

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న లోకో ఇంజన్‌ను శనివారం రెస్క్యూ టీం బయటకు తీసింది. ప్రమాదం జరిగి 37 రోజులు అవుతున్నా 8 మందిలో ఇద్దరి మృతదేహాలను మాత్రమే బయటకు తీయగలిగారు. రోబోల సాయంతో ఎండ్ పాయింట్ వరకు తవ్వకాలు జరిపారు.

New Update
slbc tunnel

slbc tunnel

SLBC టన్నెల్‌‌లో ప్రమాదం జరిగి ఇప్పటికీ 37 రోజులు అవుతున్నా అందులో చిక్కుకున్నవారి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. మొత్తం 8 మందిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభించాయి. కార్మికులు, ఇంజనీర్లు, టెక్నికల్ టీంలు ఎంతో కష్టపడి రోజుల తరబడి సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. టన్నెల్‌లో కూలిపోయిన శిథిలాలను తొలగిస్తూ టీబీఎం హెడ్ పాయింట్ వరకూ చేరుకున్నారు. TBM మిషన్‌ అడుగు భాగం వరకు తవ్వినా ఆ ఆరుగురి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా అందులో చిక్కుకున్న లోకో ఇంజిన్‌ను శనివారం బయటకు తీశారు.

ఈ సందర్భంగా టన్నెల్ లోపల సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాలు, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి కిరణ్ కుమార్, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, జీఎస్ఐ అధికారి పంకజ్ తిరుగున్, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, అన్వి రోబోటిక్స్ ప్రతినిధులు విజయ్, అక్షయ్, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Also Read: GT vs MI : దంచికొట్టిన రూ.8 కోట్ల ఆటగాడు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే!


తవ్విన కొద్దీ పెరుగుతోన్న నీటి ఊటతో పాటు ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందు వరకు ..పైకప్పు ప్రమాదకరంగా మారింది.చివరి 30 మీటర్లలో రాళ్లు, మెత్తని మట్టిని కదిలిస్తే నీటి ఊట పెరుగుతుందని..పైకప్పు కూడా కూలే అవకాశం వుందని రెస్క్యూ టీమ్స్‌ సైతం హడలిపోతున్నాయి. రోబోతోపాటు ప్రత్యేక యంత్రాల ద్వారా తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంత లోతుకు తవ్వితే వారి ఆచూకీ బయట పడుతుందో అంచనా అందడంలేదు. ఆశలు సన్నగిల్లుతున్నా సరే అవిశ్రాంతంగా ముందుకు సాగుతున్నాయి రెస్క్యూ టీమ్స్‌. దాదాపు ఎండ్‌ పాయింట్‌ 50 మీటర్ల చేరువకు చేరిన రెస్క్యూ టీమ్స్‌కు .. ఇప్పుడు ఆ 30 మీటర్ల ఆ దూరమే అత్యంత డేంజర్‌ గా మారింది. భయం భయంగానే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పైనుంచి మరోసారి మట్టి కుప్పకూలే ప్రమాదం ఉండటంతో టెన్షన్‌ పడుతున్నారు. NDRF, SDRF, ఆర్మీ, నేవీ రైల్వే సహా సింగరేణి టీమ్స్‌ సెర్చ్‌ ఆపరేషన్స్‌ను స్పీడప్‌ చేశారు. 703 మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం కానరావడం లేదు.

Also Read: Watch Video: ఘోరంగా కొట్టుకున్న స్కూల్‌ టీచర్‌, అంగన్‌వాడీ వర్కర్.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment