Lavanya : మస్తాన్ సాయి నన్ను చంపేస్తాడు...లావణ్య సంచలన ఆరోపణలు

రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి ఘటనపై లావణ్య మరోసారి ఆరోపణలు చేసింది. మీడియాతో మాట్లాడుతూ మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించింది. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేశాడని..ఎంతో మంది యువతులను చెరబట్టాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

New Update
masthan sai

masthan sai

Lavanya : రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి సంఘటనపై లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించింది. మస్తాన్ సాయి తనపై అత్యాచారం చేశాడని.. తనను వంచించినట్టే ఎంతో మంది యువతులను చెరబట్టాడని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఎంతోమంది న్యూడ్ వీడియోలు తీశాడని.. వాటిని పెట్టి బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపింది.. తాను మస్తాన్ సాయితో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు తెలిపింది. అప్పుడు మత్తుమందు కలిపి నాపై అత్యాచారం చేశాడని.. తన హార్డ్ డిస్క్ లో ఆ వీడియోలు చూసినట్లు చెప్పింది.

ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్‌ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్‌

మాస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. ఎలా అయినా అతన్ని పోలీసులకు పట్టించాలనే ఇదంతా చేసినట్లు లావణ్య చెప్పింది. మాస్తాన్ సాయి కారణంగా రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. మాస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్టు అయితే.. తనను కూడా ఆ కేసులో ఇరికిరించారని వాపోయింది. అతని వద్ద 800 నగ్న వీడియోలు పైనే ఉన్నాయని.. అందులో తన వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య వెల్లడించింది. మస్తాన్ సాయి నిజ స్వరూపం బయటపెట్టాలనే ధైర్యం చేసి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి కేసు పెట్టినట్లు చెప్పుకొచ్చింది.

Also Read :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు

గుంటూరులో కేసు పెట్టిన సమయంలోనే తనపై 20 మంది మస్తాన్ సాయి అనుచరులు దాడి చేసినట్లు లావణ్య వెల్లడించింది. మస్తాన్ సాయి తల్లిదండ్రులు మాత్రం బహిరంగంగానే.. అతని భార్య, ప్రియురాలు నగ్న వీడియోలు మాత్రమే హార్డ్ డిస్క్‌లో ఉన్నాయంటున్నారని లావణ్య పేర్కొంది. కానీ, ఆ హార్డ్ డిస్క్‌లో 44 మంది అమ్మాయిలకు సంబంధించి 250 కి పైగా వీడియోలు ఉన్నాయని చెప్పారు. రాజ్ తరుణ్, తన పర్సనల్ డేటాను కూడా తీసుకుని మస్తాన్ సాయి వేధించాడని లావణ్య ఆరోపించింది.  మాస్తాన్ సాయి వేధింపులు తట్టుకోలేకనే నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిపోయారని చెప్పింది. 2014 నుండి మాస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీలు చేస్తున్నాడని.. తన ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఇరికించాలని ప్రయత్నం చేశారంది.  

Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?

రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసు వాపస్ తీసుకుంటానని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటానని చెప్పింది..ఇకపై నా పోరాటం మస్తాన్ సాయి పైనే అని చెప్పింది. మస్తాన్‌ సాయి నుంచి తనకు ప్రాణహాని ఉందని,. నేను బతికి ఉంటానో లేదో తెలియదు అని వాపోయింది. మస్తాన్ సాయి, వాళ్ళ పేరెంట్స్ నన్ను చంపేస్తారు.. గడప దాటాలంటే భయమేస్తోంది అని వెల్లడించింది.  నార్సింగ్ డీఐ కి కాల్ చేయాలని మస్తాన్ సాయి చెప్పాడు. నేను కాల్ మాట్లాడుతున్నప్పుడు మస్తాన్ సాయి రికార్డ్ చేశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో, ఆడియో కూడా అదే.. ఇకపై అన్ని వివాదాలకు పులిస్టాప్ పెడుతున్నా. మస్తాన్ సాయి పై న్యాయపోరాటం చేస్తా.. నన్ను ట్రోల్ చేస్తున్న వారి గురించి పట్టించుకోను. నేను చేస్తున్న పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టించుకోను..” అని లావణ్య కీలక వ్యాఖ్యలు చేసింది.

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు