మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతాల్లో చిరుత సంచారిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరుత కోసం గాలిస్తున్నారు. By B Aravind 18 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్ నడిబొడ్డున చిరుత పులి సంచారించడం కలకలం రేపింది. నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతాల్లో చిరుత సంచారంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరుత కోసం గాలిస్తున్నారు. అసలు ఆ చిరుత ఎక్కడి నుంచి వచ్చింది. ఒక్కటే ఉందా దాంతో పాటు ఇంకా చిరుతలు ఉన్నాయా అనేదానిపై ఆందోళన నెలకొంది. Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే! మియాపూర్ మెట్రో స్టేషన్ నిత్యం నగరవాసులతో కిటికిటలాడుతోంది. ఆ ప్రాంత సమీపంలో చిరుతు సంచారిస్తుందన్న విషయం తెలియడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో చిరుతలు సంచరిస్తున్న సీసీటీవీ ఫుటెజీలు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట అన్నమయ్య జిల్లా రామాపురం మండంలోని చిట్లూరు, ఎగువ బండపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో కూడా గురువారం ఓ చిరుత పంట పొలాల్లో సంచరించింది. దీంతో అక్కడి ప్రజల్లో కంటి మీద కునుకు లేకుండా పోయింది. బయటకు మేకలు, ఆవులు, గొర్రెలు, గెదెల్ని తీసుకెళ్లాలన్న కాపర్లు భయపడుతున్నారు. రైతులు కూడా తమ పొలం వద్దకు వెళ్లాలంటనే జంకుతున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు, ఏన్కూరు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతమైన ఎర్రగుట్ట పొలాల్లో కూడా చిరుత సంచారిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అధికారుల కూడా చిరుత సంచారం నిజమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. Also Read: మీరెవర్ని చంపినా , ఎంతమందిని చంపినా తగ్గేదే లేదు..హమాస్ సంచలన ప్రకటన Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? #leopard #cheetah #miyapur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి