/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/heart-attack-can-be-preceded-by-many-different-symptoms.jpg)
Heart Attack Law Student
TG crime: ఈ మధ్య కాలంలో సడెన్ హార్ట్ ఎటాక్‌లకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారు గుండెపోటు వచ్చేది. కానీ ప్రస్తుత కాలంలో ఆరేళ్ల పసిపిల్లల నుంచి యువత కూడా హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అందరితో సరదాగా గడిపినవారు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ.. ఇలా ఎంతో మంది ఆకస్మాత్తుగా చనిపోతున్నారు. ఇలాంటి అలక మరణంతో వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదన్ని నింపుతున్నారు. తాజాగా లా విద్యార్థి స్నానం చేస్తుండగా.. హార్ట్ ఎటాక్‌కు గురై ప్రాణాలు విడిచాడు.ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
గుండెపోటు గురై... లా స్టూడెంట్:
లా స్టూడెంట్ స్నానం చేస్తుండగా.. హార్ట్ఎటాక్ వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించే లోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా నందిగా సింబయోసిస్ డీమ్డ్ హాస్టల్‌లో జరిగింది. మృతుడు ఢిల్లీకి చెందిన షాద్‌నిక్ (19)గా గుర్తించారు. సొమవారం ఉదయం కాలేజీకి వెళ్లేందుకు స్నానం చేస్తుండగా.. గుండెపోటు వచ్చింది. గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే శంషాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ..అప్పటికే షాద్‌నిక్ మృతి చెందినట్లు చెప్పారు. అక్కడి నుంచి షాద్‌నిక్ డెడ్‌బాడీని ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యార్థి మృతి విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపారు. చిన్న వయస్సులోనే గుండెపోట్లతో ప్రాణాలు కోల్పోవటంలో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గంట వ్యాయమం ముఖ్యం:
అయితే.. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి తగినంత వ్యాయమం లేకపోవటం.. బయట ప్రాసెస్డ్ ఫుడ్, విపరీతమై స్ట్రెస్ వంటివి గుండె జబ్బులకు ముఖ్య కారణాలని చెబుతున్నారు. రోజులో గంటసేపైనా వ్యాయమం, యోగా, నడక వంటి చేయాలి ఇలా చేయటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. పని ఒత్తిడిన తగ్గించుకోవటం శరీరానికి మంచిది. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా సమతుల ఆహారం తీసుకుంటూ.. మంచి నిద్ర పోవాలని వైద్యులు అంటున్నారు. కొవిడ్ తర్వాత గుండె జబ్బులు ఎక్కువగా ఉంటున్నాయని.. తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం వలన ప్రమాదం నుంచి బయట పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రోజంతా నిద్రపోతున్నారా.. ఈ సమస్యకు కారణం ఇదే