Hyderabad : కష్టాల్లో కుమారి ఆంటీ..బిజినెస్ డల్..నష్టాల్లో ఉన్నా రేట్లు పెంచనంటూ!

హైదరాబాద్‌ వీధి వంటకాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీ ప్రస్తుతం తీవ్రమైన గ్యాస్ సిలిండర్ల కొరతతో సతమతమవుతున్నారు. గత కొద్ది రోజులుగా సిలిండర్ల సరఫరా సరిగ్గా లేకపోవడంతో

New Update
kumari

హైదరాబాద్‌ వీధి వంటకాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీ ప్రస్తుతం తీవ్రమైన గ్యాస్ సిలిండర్ల కొరతతో సతమతమవుతున్నారు. గత కొద్ది రోజులుగా సిలిండర్ల సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఆమె వ్యాపారం డల్‌గా సాగుతోంది. సాధారణంగా రకరకాల వంటకాలతో కస్టమర్లను అలరించే ఆమె, ఇప్పుడు గ్యాస్ లేక ఎక్కువ రకాల కూరలు వండలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీవీతో మాట్లాడిన ఆమె పలు విషయాలు పంచుకున్నారు. 

మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. దాదాపు 8 వేల రూపాయలు పెడతామన్నా కూడా సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పోనీ ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి మీద వంట చేద్దామంటే, ఇంటి యజమాని అందుకు అంగీకరించడం లేదని కుమారి ఆంటీ తెలిపారు. గత్యంతరం లేక చివరకు చిన్న గ్యాస్ సిలిండర్లను 6 వేల రూపాయల ధరకు కొనుగోలు చేసి వంటలు కొనసాగిస్తున్నారు.

లాభాల కంటే నష్టాలే ఎక్కువ

ఈ గ్యాస్ కష్టాల వల్ల ప్రస్తుతం వ్యాపారంలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తున్నాయని, అయినా సరే వెనకడుగు వేయకుండా నష్టాలను భరిస్తూనే బిజినెస్ రన్ చేస్తున్నానని ఆమె చెప్పారు. ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకాన్ని తనకుల ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బయట హోటళ్లలో రేట్లు పెరిగినప్పటికీ, తను మాత్రం పాత ధరలకే కస్టమర్లకు భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రజలే తనకు అండగా నిలిచారని, ఆ కృతజ్ఞతతోనే ధరలు పెంచడం లేదని కుమారి ఆంటీ భావోద్వేగానికి లోనయ్యారు. వారిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో, రాబోయే మరో వారం రోజుల పాటు కూడా ఇలాగే రేట్లు పెంచకుండా కస్టమర్లకు సేవ అందిస్తానని ఆమె స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు