ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ రియాక్షన్.. అసలు నిజం ఇదేనంటూ! ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ స్పందించారు. దీపావళికి ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. అది ఫాంహౌస్ కాదని.. తన బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు అని అన్నారు. కానీ కొందరు దాన్ని రేవ్ పార్టీ అంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. By Seetha Ram 27 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి జన్వాడ ఫాంహౌస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళికి ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. అది ఫాంహౌస్ కాదని.. తన బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు అని అన్నారు. గృహప్రవేశం చేసినప్పుడు పిలవలేదని ఇప్పుడు ఫ్యామిలీకి పార్టీ ఇచ్చాడని తెలిపారు. ఇది కూడా చదవండి: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్! రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు బనాయిస్తున్నారు అక్కడ లిక్కర్ కూడా ఉండొచ్చు.. కానీ ఆ పార్టీలో తన అత్తమ్మ, పిల్లలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. కానీ కొందరు దాన్ని రేవ్ పార్టీ అంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ లేవని అధికారులూ చెప్పారని తెలిపారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులు, బంధువుల మీద కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు 11 నెలలుగా ఎన్నో ఇబ్బందులు 11 నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. ఉద్యమ స్ఫూర్తితో తాము కేసులకు భయపడబోమని అన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం తరఫున ఒక్కరూ మాట్లాడట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నిరంతరాయంగా పోరాటం చేస్తుందని తెలిపారు. ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చినవాళ్లమన్నారు. ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? ఇలాంటి కుట్రలకు తాము భయపడమని చెప్పారు. దావత్‌లో 13 మందికి నెగిటివ్ వస్తే ఒకరికే పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారని.. ఆ వ్యక్తి ఎక్కడ డ్రగ్ తీసుకున్నారో విచారించాలని తెలిపారు. సోదాల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా ఇదిలా ఉంటే జన్వాడ ఫామ్‌హౌస్ ఇష్యూపై రీసెంట్‌గా కేసీఆర్ సైతం సీరియస్ అయ్యారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల ఇళ్లల్లో సోదాలు ఎలా నిర్వహిస్తున్నారంటూ డీజీపీకి ఫోన్ చేసి ఆరాతీశారు. వెంటనే సోదాలు ఆపాలని డీజీపీని కోరారు. #ktr #rave-party #janwada farmhouse ktr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి