Formula E race: కేటీఆర్ అరెస్టు?

ఫార్ములా- ఈ కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సమాచారం. దీంతో కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
ktr (1)

ఫార్ములా- ఈ కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఫైల్ అందినట్లు సమాచారం. గవర్నర్‌ నుంచి ఆమోదం రావడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Japan: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఫార్ములా-ఈ రేసులో ఉల్లంఘణలు జరిగాయని..

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహణలో ఉల్లంఘణలు జరిగాయని కేటీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి. నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందు నిధులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా ఈ కారు సంస్థకు రూ. 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు.

ఇది కూడా చూడండి: Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

దీంతో కేటీఆర్‌, అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌పై ఎణ్‌ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏసీపీ ప్రభుత్వానికి గత నెలలోనే లేఖ రాసింది. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫార్ములా-ఈ కారు రేస్‌పై ఇప్పటికే పురపాలక శాఖ కమిషనర్ అర్వింద్‌ కుమార్‌‌ను నోటీసులు పంపించారు. అలాగే చీఫ్ ఇంజనీర్‌ను కూడా ఏసీబీ విచారించింది. ఇప్పుడు మళ్లీ గవర్నర్ ఆమోదంతో కేసు మరో మలుపు తిరగబోతోంది. 

ఇది కూడా చూడండి: TN: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి

ఇదిలా ఉండగా.. భారత్‌లో మొదటిసారిగా ఫార్ములా ఈ రేసింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ-కార్ రేస్ 2023 ఫిబ్రవరి 11న జరిగింది.

ఇది కూడా చూడండి: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

New Update
BRS meeting

BRS meeting

KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

 కాంగ్రెస్ ను తిరస్కరించండి


‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్


ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

Advertisment
Advertisment
Advertisment