తగ్గేదేలేదంటున్న కొండా సురేఖ.. వేములవాడలో మరో వివాదం! మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం వేములవాడ ఆలయాన్ని దర్శించుకోగా స్వామివారి నైవేద్యాన్ని ఆపి మరీ అర్చకులు సురేఖ ఫ్యామిలీకి పూజలు చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By srinivas 14 Oct 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి Konda Surekha: మంత్రి మంత్రి కొండా సురేఖ మరో వివాదాస్పదమైన చర్యకు పాల్పడ్డారు. ఇప్పటికే వరుస దుందుడుకు చర్యలతో వార్తల్లో నిలుస్తున్న సురేఖ తాజాగా వేములవాడ రాజన్న సన్నిధిలో మరోసారి రెచ్చిపోయారు. ఈ మేరకు సోమవారం స్వామివారిని కుటుంబసమేతంగా కొండా సురేఖ దర్శించుకోగా.. సురేఖ కోసం స్వామివారి నైవేద్యం చాలా సేపు ఆపేశారు ఆలయ అధికారులు. ఇది కూడా చదవండి: ఆ విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌కన్ కంపెనీలో సీఎం రేవంత్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు దర్శించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. pic.twitter.com/AQFyPXcPZC — CDM_RajannaSircilla (@Collector_RSL) October 14, 2024 30 నిమిషాలు ఆలస్యంగా నివేదన.. నిజానికి సోమవారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి 3 గంటలకు నైవేద్యం సమర్పించాల్సి ఉండగా.. 30 నిమిషాలు ఆలస్యంగా నివేదన సమర్పించారు అర్చకులు. స్వామివారి నైవేద్యాన్ని ఆపి మరీ.. కొండా సురేఖకు కుటుంబానికి పూజలు నిర్వహించారు. దీంతో మంత్రి కొండా సురేఖతోపాటు అధికారుల తీరుపై భక్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: క్రైమ్ ప్రపంచానికి రారాజు.. లారెన్స్ బిష్ణోయ్ నేర ప్రస్థానమిదే! ఇదిలా ఉంటే.. ఇటీవలే కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన అనుచరులను అరెస్ట్ చేసినందుకు గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నానా హంగామా చేశారు. ఏకంగా సీఐ కుర్చీలో కూర్చుని అరెస్ట్ చేసినవారిని విడిచిపెట్టాలంటూ హల్‌చల్ చేశారు. తన వర్గం కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రభాస్ సినిమా కోసం నన్ను మోసం చేసారు.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్ మంత్రి కొండ సురేఖ రాకతో గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తతసీఐ కుర్చీలో కూర్చున్న మంత్రి కొండా సురేఖపోలీస్ స్టేషన్కి భారీగా చేరుకున్న కొండ సురేఖ వర్గీయులు.. తన వర్గం కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని ఆరాతీస్తున్న మంత్రి సురేఖ.మంత్రి కొండా సురేఖ, రేవూరి ప్రకాష్… pic.twitter.com/f8l4ak7MEz — RTV (@RTVnewsnetwork) October 13, 2024 ఇది కూడా చదవండి: మరో వివాదంలో కొండా సురేఖ.. పోలీస్ స్టేషన్‌లో రచ్చ రచ్చ! #konda-surekha #vemulavada మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి